‘ప్రేమంటే ఇదేరా’…

 

కేరళలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ప్రేమంటే ఏంటో తెలిపిన పెళ్లి ఇది. ప్రేమంటే ఆస్థి అంతస్థులు, కులం-మతం, వయస్సు, అందం ఇవేవి కావని నిరూపించిన పెళ్లి. వికలాంగుడైన యువకుణ్ణి ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుని అందరి చేతా ప్రశంసలు పొందిందీ కేరళ యువతి. వివరాల్లోకి వెళితే.. త్రిసూర్ పట్టణానికి 25 కిలీమీటర్ల దూరంలో ఉన్న తాజేఘాట్‌కు చెందిన ప్రణవ్‌కి ఆరేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగి ప్రమాదంలో తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అన్నింటికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. అయినప్పటికీ అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండేవాడు. ప్రణవ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో ప్రణవ్ తల్లి తనకి అన్నం తినిపిస్తున్న వీడియో షేర్ చేస్తే వైరల్‌గా మారి తిరువనంతపురానికి చెందిన షహానా ఓ రోజు అనుకోకుండా ప్రణవ్ వీడియోలు చూసింది. అతని కాన్ఫిడెన్స్ నచ్చి సోషల్ మీడియాలో అతడితో మాట్లాడింది. కొన్ని నెలల తర్వాత ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి మాట్లాడుతుండేది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. కొన్ని రోజుల తర్వాత షహానా.. ప్రణవ్‌కు తన ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకుందామంది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

Kerala Woman wins heart by married Paralysed Man

The post ‘ప్రేమంటే ఇదేరా’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.