రేప్‌పై ఎంపీ భార్య కొత్త సూక్తులు!

తిరువనంతపురం: విధి రేప్ లాంటిది. ప్రతిఘటించడం సాధ్యం కాకపోతే దాన్ని ఆస్వాదించాలి అంటూ కేరళ ఎంపి హిబీ ఇడెన్ భార్య అన్నా లిండా ఇడెన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆమె పెట్టిన పోస్టింగ్‌పై తీవ్ర వివాదం చెలరేగడంతో ఆమె మంగళవారం ఉదయం ఆ పోస్టింగ్‌ను తొలిగించారు.ఎర్నాకుళం నుంచి ఎంపిగా హిబీ ఇడెన్ ఎన్నికయ్యారు. కోచ్చిలో సోమవారం భారీ వర్షం కురిసి వారు ఉంటున్న ఇల్టు జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీట […] The post రేప్‌పై ఎంపీ భార్య కొత్త సూక్తులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరువనంతపురం: విధి రేప్ లాంటిది. ప్రతిఘటించడం సాధ్యం కాకపోతే దాన్ని ఆస్వాదించాలి అంటూ కేరళ ఎంపి హిబీ ఇడెన్ భార్య అన్నా లిండా ఇడెన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆమె పెట్టిన పోస్టింగ్‌పై తీవ్ర వివాదం చెలరేగడంతో ఆమె మంగళవారం ఉదయం ఆ పోస్టింగ్‌ను తొలిగించారు.ఎర్నాకుళం నుంచి ఎంపిగా హిబీ ఇడెన్ ఎన్నికయ్యారు. కోచ్చిలో సోమవారం భారీ వర్షం కురిసి వారు ఉంటున్న ఇల్టు జలదిగ్బంధంలో చిక్కుకుంది.

నీట మునిగిన తమ ఇంట్లో నుంచి తమ చిన్నారిని రక్షిస్తున్న క్లిప్పింగులతో కూడిన రెండు షార్ట్ వీడియోలను ఎంపీ భార్య అన్నా లిండా తన ఫేస్‌బుక్‌లో సోమవారం పోస్ట్ చేశారు. దానికి ఆమె పెట్టిన శీర్షిక ఇలా ఉంది&విధి రేప్ లాంటిది..దాన్ని ప్రతిఘటించలేనప్పుడు ఆస్వాదించడానికి ప్రయత్నించాలి అని ఆమె పెట్టిన క్యాప్షన్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అసంబద్ధమైన వ్యాఖ్యలు రాసినందుకు వారు ఆమెపై మండిపడ్డారు. అయితే అన్నా కాని హిబీ కాని దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

Kerala MPs wife controversial remarks on Face Book, Anna Linda Eden, wife of Ernakulam MP Hibi Eden said that fate is like rape, if you cant resist it then try to enjoy it

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేప్‌పై ఎంపీ భార్య కొత్త సూక్తులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: