అలనాటి బాలలు…. ఈనాటి భామలు

ఈ నటీమణులు ఒకప్పటి బాలనటులు. చిన్నప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. పెద్ద నటీనటులతో నటించి ప్రస్తుతం తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో పెద్ద నటుల పక్కన హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమై, ‘మహానటి’తో అందరితో శభాష్ అనిపించుకుంది.కీర్తి సురేష్. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. తండ్రి నిర్మాతగా వచ్చిన మలయాళ చిత్రం ‘పైలట్స్’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు […] The post అలనాటి బాలలు…. ఈనాటి భామలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ నటీమణులు ఒకప్పటి బాలనటులు. చిన్నప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. పెద్ద నటీనటులతో నటించి ప్రస్తుతం తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో పెద్ద నటుల పక్కన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కీర్తి సురేష్
‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమై, ‘మహానటి’తో అందరితో శభాష్ అనిపించుకుంది.కీర్తి సురేష్. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. తండ్రి నిర్మాతగా వచ్చిన మలయాళ చిత్రం ‘పైలట్స్’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన
‘గీతాంజలి’.

సాయి పల్లవి
‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది సాయి పల్లవి. ఈ అమ్మడు మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కానీ 14 ఏళ్ల కిందటే బాలనటిగా సాయిపల్లవి వెండితెరకు పరిచయం అయ్యింది. తమిళంలో ‘కస్తూరిమాన్, ‘ధామ్ ధూమ్’లు ఆమె తొలి రెండు చిత్రాలు. 2008, 2009లో విజయ్ టీవీలో ప్రసారం అయిన ఉంగలిల్ యార్ అడుత్త ప్రభుదేవా, ఈటీవీ ఢీ4 డాన్స్‌షో పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఆమె.. తిరిగి ‘ప్రేమమ్’ దర్శకుడి పిలుపుతో హీరోయిన్ అయ్యింది.

నిత్యా మీనన్

నటన, చక్కటి గాత్రం, అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ నిత్యా మీనన్ పదేళ్ల వయసులోనే బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. 1998లో ఓ ఇండియన్ ఇంగ్లిష్ సినిమాలో టబు చిట్టిచెల్లి పాత్రను పోషించింది. 2008లో ‘ఆకాశ గోపురం’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తెలుగులో మాత్రం ఆమె మొదటి సినిమా 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

నివేదా థామస్


‘జెంటిల్‌మెన్, ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా తన నటన, అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నివేదా థామస్. ఈ భామ బాలనటిగానూ ఎంతో పేరుతెచ్చుకుంది. 2008లో వచ్చిన మలయాళ చిత్రం ‘వెరుతె ఒరు భార్య’ సినిమాకు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటి అవార్డుని సైతం అందుకుంది. నిజానికి నివేదా అయిదేళ్ల వయసు నుంచే టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. సన్‌టీవీలో వచ్చిన ‘మై డియర్ భూతం’ సీరియల్ ఆమెకు గుర్తింపు తెచ్చింది. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్‌లో కమల్ హాసన్ కుమార్తెగానూ నివేదా నటించింది. ఇలా ఎన్నో సినిమాల్లో చిన్నా పెద్దా పాత్రలు చేసిన తర్వాత తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Keerthi Suresh became heroine from child actress

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అలనాటి బాలలు…. ఈనాటి భామలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: