లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

రాజన్న సిరిసిల్ల: తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, కెటిఆర్ పర్యటిస్తున్నారు. తుంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో ఐటిఐ కళాశాలను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రూ.7కోట్ల 74 లక్షలతో ఐటిఐ కళాశాల నిర్మాణం చేపడుతున్నామని, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపాదికగా తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను బీడుభూములకు మళ్లిస్తున్నారని, ఇంటింటికీ […]

రాజన్న సిరిసిల్ల: తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, కెటిఆర్ పర్యటిస్తున్నారు. తుంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో ఐటిఐ కళాశాలను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రూ.7కోట్ల 74 లక్షలతో ఐటిఐ కళాశాల నిర్మాణం చేపడుతున్నామని, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపాదికగా తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను బీడుభూములకు మళ్లిస్తున్నారని, ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, ఉద్యోగుల భర్తీ కాకుండా విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని వెల్లడించారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిస్తున్న వైనాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండిలి చైర్మన్ స్వామి గౌడ్, ఎంపిలు వినోద్, బాల్కసుమన్ పాల్గొన్నారు.

Related Stories: