స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2గంటల మధ్య నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి కవిత నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బయల్దేరేముందు మినిస్టర్ క్వార్టర్స్ లో స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కవిత భేటీ అయ్యారు. ఆమెకు స్వీకర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి […] The post స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2గంటల మధ్య నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి కవిత నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బయల్దేరేముందు మినిస్టర్ క్వార్టర్స్ లో స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కవిత భేటీ అయ్యారు. ఆమెకు స్వీకర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బిజెపి ఎన్నికల బరిలో ఉన్నప్పటీకి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7వతేదీన పోలింగ్ నిర్వహించి‌ 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Kavitha to file nomination as MLC from Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: