చెంగల్‌లో కవిత రోడ్‌షో

నిజామాబాద్: గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో పని చేశామని, భవిష్యత్ లో బంగారు తెలంగాణ రూపకల్పనకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తామని నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో శుక్రవారం కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  అన్ని ఆరోగ్య పరీక్షలు చేసేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం […] The post చెంగల్‌లో కవిత రోడ్‌షో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్: గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో పని చేశామని, భవిష్యత్ లో బంగారు తెలంగాణ రూపకల్పనకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తామని నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో శుక్రవారం కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  అన్ని ఆరోగ్య పరీక్షలు చేసేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాల నేతలు కట్టుకథలు చెబుతూ వస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.  టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అని ఆమె పేర్కొన్నారు. బీడీ పరిశ్రమలను ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని,  దేశంలో 13 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నారని ఆమె తెలిపారు. కేవలం తెలంగాణలోని బీడీ కార్మికులకు తమ ప్రభుత్వం ఫించన్ ఇస్తుందని ఆమె చెప్పారు.  భవిష్యత్ లో తెలంగాణలో జాతీయ పార్టీలకు స్థానం ఉండదని ఆమె జోస్యం చెప్పారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ఆమె తెలిపారు.  బ్యాంకులతో సంబంధం లేకుండా 100 శాతం సబ్సిడీతో అన్ని వర్గాల ప్రజలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు అదనంగా ఆదాయం వచ్చేలా అనేక రకాల వ్యవసాయ వస్తువులు తయారు చేయిస్తామన్నారు. ప్రజలు దీవించటం వల్లే కెసిఆర్ రెండోసారి సిఎం అయ్యారని కవిత పేర్కొన్నారు. ఈ రోడ్ షోలో  మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొని మాట్లాడారు. నాలుగు నెలల్లో కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ నింపుతామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భీంగల్ మండలానికి సాగు, తాగు నీటి కొరత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. పసుపు బోర్డు కోసం పోరాటం చేసిన కవిత పైన కావాలని కాంగ్రెస్, బిజెపి నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు  కోసం ఆరు రాష్ట్రాలకు చెందిన  సిఎంలను కవిత కలిసినట్టు ఆయన తెలిపారు. పసుపు బోర్డు కోసం ప్రధాని మోడీకి లేఖ సైతం రాశారని పేర్కొన్నారు.  పసుపు బోర్డు కోసం పార్లమెంట్‌లో కవిత ఒక్కరే మాట్లాడారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో 16 మంది టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Kavitha Election Campaign in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెంగల్‌లో కవిత రోడ్‌షో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: