నా ఓటమికి కుట్ర : కవిత

జగిత్యాల : నిజామాబాద్‌ లోక్ సభ స్థానం నుంచి  తనను ఓడించేందుకు  బిజెపి, కాంగ్రెస్‌  కుట్ర చేశాయని నిజామాబాద్‌ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కవిత ఆరోపించారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలు జట్టు కట్టాయని ఆమె ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఐదేళ్లలో తెలంగాణకు చెందిన ఏ సమస్యనూ పరిష్కరించలేదని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ లో  పసుపు బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా,  ప్రధాని నరేంద్రమోడీ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. […] The post నా ఓటమికి కుట్ర : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జగిత్యాల : నిజామాబాద్‌ లోక్ సభ స్థానం నుంచి  తనను ఓడించేందుకు  బిజెపి, కాంగ్రెస్‌  కుట్ర చేశాయని నిజామాబాద్‌ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కవిత ఆరోపించారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలు జట్టు కట్టాయని ఆమె ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఐదేళ్లలో తెలంగాణకు చెందిన ఏ సమస్యనూ పరిష్కరించలేదని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ లో  పసుపు బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా,  ప్రధాని నరేంద్రమోడీ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. నిజామాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటే, ఏ విధంగా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతున్న టిఆర్ఎస్ ను ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె కోరారు. తన ఓటమే ధ్యేయంగా కలిసిపోయిన బిజెపి, కాంగ్రెస్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Kavitha Comments on BJP and Congress

The post నా ఓటమికి కుట్ర : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: