కత్తి మహేష్ అరెస్ట్

Kathi Mahesh arrested by cyber crime police

హైదరాబాద్: టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ లో శ్రీరాముడికి సంబంధించిన అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీరామ నవమి ముందు అతడు శ్రీరాముడిని కించపరిచేలా పోస్టులు చేశారు. దీంతో హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కత్తిమహేష్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కొన్ని నెలల కిందట కత్తి ఫేస్ ‌బుక్, ట్విటర్ ‌లో శ్రీరాముడి గురించి (రాముడు కరోనా ప్రియుడు) అసభ్యకర పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కత్తి మహేష్ అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.