కశ్మీరు కల్లోలంగానే ఉందంటున్న సైనిక నివేదిక

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ అంతా ప్రశాంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 306 హింసాత్మక సంఘనటలు జరిగాయని భద్రతా దళాలకు చెందిన ఆంతరంగిక నివేదిక వెల్లడించింది. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు జరిపిన రాళ్ల […] The post కశ్మీరు కల్లోలంగానే ఉందంటున్న సైనిక నివేదిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ అంతా ప్రశాంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 306 హింసాత్మక సంఘనటలు జరిగాయని భద్రతా దళాలకు చెందిన ఆంతరంగిక నివేదిక వెల్లడించింది. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు జరిపిన రాళ్ల దాడులలో 89 మంది కేంద్ర పారామిలిటరీ దళాలతో సహా 100 మంది వరకు భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఆ నివేదికలో పేర్కొన్నారు. గడచిన రెండు నెలల్లో భద్రతా దళాలు ఐదు ఎన్‌కౌంటర్లు జరిపాయని, వీటిలో ఇద్దరు భద్రతా జవాన్లు మరణించగా 9 మంది గాయపడ్డారని అందులో తెలిపారు.

ఆగస్టు 21న బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక పోలీసు అధికారి బిలాల్ అహ్మద్ మరణించారని సబ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌దీప్ పరిహార్ తీవ్రంగా గాయపడ్డారని నివేదికలో వెల్లడించారు. కాగా ఈ ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులు మరణించారని కూడా తెలిపారు. భద్రతా దళాలపై రెండు సార్లు గ్రెనేడ్ దాడులు జరిగాయని, రెండు సందర్భాలలో భద్రతా దళాల నుంచి తుపాకులు అపహరించేందుకు ప్రయత్నం జరిగిందని కూడా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ రెండు నెలల కాలంలో ఒక్క బుల్లెట్‌ను కాల్చడం కాని ఒక్క వ్యక్తి కాల్పులలో మరణించడం కాని జరగలేదని చెబుతోంది. కాగా, సెప్టెంబర్ 4న శ్రీనగర్‌లో నిరసనకారులు నిర్వహించిన ఊరేగింపుపై భద్రతా దళాలు కాల్పులు జరగగా తూటా తగిలి తొమ్మిదవ తరగతి విద్యార్థి అస్రర్ అహ్మద్ ఖాన్ మరణించాడు. అయితే సైన్యం మాత్రం అతను రాళ్ల దాడిలో మరణించాడు తప్ప తుపాకీ తూటా వల్ల కాదని వాదిస్తోంది.

Kashmir is not in peace, says internal document of forces

The post కశ్మీరు కల్లోలంగానే ఉందంటున్న సైనిక నివేదిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: