క‌శ్మీర్ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : మెహమూద్ మదానీ

ఢిల్లీ : జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని భారత ఇస్లామిక్ సంస్థ జమాత్ ఉలేమా హి హిందు చీఫ్ మెహమూద్ మదానీ తేల్చి చెప్పారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దును ఆయన స్వాగతించారు. భారత్ కు ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారని పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రతి భారత ముస్లిం ఖండిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని జమాత్ ఉలేమా […] The post క‌శ్మీర్ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : మెహమూద్ మదానీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని భారత ఇస్లామిక్ సంస్థ జమాత్ ఉలేమా హి హిందు చీఫ్ మెహమూద్ మదానీ తేల్చి చెప్పారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దును ఆయన స్వాగతించారు. భారత్ కు ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారని పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రతి భారత ముస్లిం ఖండిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని జమాత్ ఉలేమా హి హిందు తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. తాము భారతీయులమేనని, దేశ ప్రజల సంక్షేమం కోసం భారత్ తీసుకునే చర్యలకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ మొత్తం భారత్ లో కలవడం వల్లనే అక్కడ సంక్షేమం వెల్లువిరుస్తుందని ఆయన చెప్పారు.

Kashmir Is Integral Part Of India : Mehmood Madani

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క‌శ్మీర్ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : మెహమూద్ మదానీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: