రేపు ఉదయానికి జూరాలకు నీరు

నారాయణపూర్ నుంచి విడుదలైన కృష్ణ జలాలు మన తెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక నుంచి విడుదలైన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి మేరకు 2.5 టిఎంసిల నీటిని ఆల్మట్టి నుంచి విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. నారాయణపూర్ నుంచి విడుదలైన నీరు ఆదివారం సాయంత్రానికి గుగల్‌కు చేరింది. అయితే ఆల్మట్టి నుంచి 2.3 టిఎంసిలు కర్ణాటక విడుదల చేయగా, ప్రవాహ నష్టాలు, ఆవిరి నష్టాలు, […] The post రేపు ఉదయానికి జూరాలకు నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నారాయణపూర్ నుంచి విడుదలైన కృష్ణ జలాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక నుంచి విడుదలైన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి మేరకు 2.5 టిఎంసిల నీటిని ఆల్మట్టి నుంచి విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. నారాయణపూర్ నుంచి విడుదలైన నీరు ఆదివారం సాయంత్రానికి గుగల్‌కు చేరింది. అయితే ఆల్మట్టి నుంచి 2.3 టిఎంసిలు కర్ణాటక విడుదల చేయగా, ప్రవాహ నష్టాలు, ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు పోనూ, 1.9 టిఎంసిల నీరు నారాయణపూర్‌కు చేరింది. ఈ నీటిని నారాయణపూర్ నుంచి విడుదల చేయగా, ఆదివారం సాయంత్రానికి గుగల్ బ్యారేజికి చేరిందని సమాచారం. ఆల్మట్టి, నారాయణపూర్ స్పిల్ వే మూసేసి, నీటి విడుదల ఆపేశారు. గుగల్ బ్యారేజి నుంచి విడుదలైన నీరు గిరిజాపూర్ బ్యారేజికు విడుదల చేశారు. అయితే ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు 60 కిలోమీటర్ల దూరం ఉంది.

నారాయణపూర్ నుంచి గుగల్‌కు 110 కిలోమీటర్ల దూరం నీరు ప్రవహించింది. గుగల్ నుంచి గిరిజాపూర్ బ్యారేజికి 20 కిలోమీటర్ల దూరం, ఉండగా ఇక్కడి నుంచి జూరాలకు 50 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తంగా ఆల్మట్టి నుంచి జూరాలకు 240 కిలోమీటర్ల దూరం ఉంది. గుగల్ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. అంటే ఇంకా 70 కిలోమీటర్ల మేర నీరు నదిలో ప్రవహించాకే జూరాలకు వస్తుంది. గిరిజాపూర్‌కు వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తారా, మొత్తం నీరు వచ్చాకే విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది. భానుడి ప్రతాపానికి నీటి ప్రవాహం ఆవిరితో కొంత, ఇసుక తిన్నెల దాహం తీరుస్తూ కొంత నష్టమవుతుండడంతో జూరాలకు ఎంత నీరు వాస్తవంగా చేరుతుందో చేరాకే తెలుస్తుంది. 2.3 టిఎంసిల ఆల్మట్టి నుంచి విడుదలైనా జూరాలకు కనీసం 1 టిఎంసి నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Karnataka to release Krishna water for Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేపు ఉదయానికి జూరాలకు నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: