తెరపైకి మరో రాజకీయ కోణం…జెడిఎస్ తో బిజెపి

  బెంగళూరు: కన్నడ రాజకీయాలు రసకందాయంగా మారాయి. బిజెపితో జెడిఎస్ దోస్తీ కట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జెడిఎస్‌కు డిప్యూటీ సిఎం ఇస్తామని బిజెపి నేతలు ఆఫర్ చేసినట్టు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి సన్నిహితుడు ఎస్‌ఆర్ మహేశ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌తో సమావేశమయ్యారు. దీంతో వీళ్లు కలిసి ఉన్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సమావేశంలో బిజెపి నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప కూడా పాల్గొన్నారు. ఈ […] The post తెరపైకి మరో రాజకీయ కోణం… జెడిఎస్ తో బిజెపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కన్నడ రాజకీయాలు రసకందాయంగా మారాయి. బిజెపితో జెడిఎస్ దోస్తీ కట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జెడిఎస్‌కు డిప్యూటీ సిఎం ఇస్తామని బిజెపి నేతలు ఆఫర్ చేసినట్టు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి సన్నిహితుడు ఎస్‌ఆర్ మహేశ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌తో సమావేశమయ్యారు. దీంతో వీళ్లు కలిసి ఉన్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సమావేశంలో బిజెపి నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు చర్చించలేదని కుమారస్వామి. మురళీధర్ రావు స్పష్టం చేశారు. ప్రతి దానికి రాజకీయ పరిణామాలు అంటగట్టడం సరికాదని మురళీధర్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్-జెడిఎస్ బంధం బలంగా ఉందని సిఎం కుమార స్వామి పేర్కొన్నారు. గతంలో బిజెపి-జెడిఎస్ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి, యడ్యూరప్ప చెరో 20 నెలలు ప్రభుత్వాన్ని నడిపించారు.

 

Karnataka Political Crisis: BJP Alliance with JDS

 

The post తెరపైకి మరో రాజకీయ కోణం… జెడిఎస్ తో బిజెపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: