కర్నాటక ఉత్కంఠకు నేడు తెర

Karnataka by-Election

 

ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ప్రభుత్వం భవిష్యత్తును నిర్ణయించే కీలక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నేడే

బెంగళూరు : కర్ణాటకలో నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన యెడ్డియూరప్ప నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భవితవ్యం సోమవారం తేలబోతున్నది. డిసెంబర్ 5న రా ష్ట్ర ంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతుంది. సోమవారం ఉదయం 8 గంటలకు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడి కావచ్చని ఎన్నికల అధికారులు చెప్పా రు. కాంగ్రెస్, జనతాదళ్‌కు చెందిన 17 మంది ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు పడడంతో ఉప ఎ న్నికలు అవసరమయ్యాయి. వారి తిరుగుబా టు హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వం పతనానికి దారితీసింది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.

రెండు నియోజకవర్గాలకు సంబంధించి కేసులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో 15 స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు జరిగాయి. 67.91 శాతం పోలింగ్ జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చాలా కీలకం. యెడ్డీ సర్కార్‌కు మెజారిటీ రావాలంటే అసెంబ్లీలో బిజెపికి ఇంకా ఆరు స్థానాలు అవసరం. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో తిరుగుబాటు ఎంఎల్‌ఎలు లేనందువల్ల 208 మంది సభ్యులే మిగిలారు. జూలై 29న ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని నెగ్గారు. అయితే, మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం.

Karnataka by-Election results today

The post కర్నాటక ఉత్కంఠకు నేడు తెర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.