‘రూపాయికే అంతిమ యాత్ర’

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిథి : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు నానా ఇబ్బందులు, అవస్థలు పడే పేదవారికి మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నది కరీంనగర్ బల్దియా. పేదలకు ఆఖరి సఫర్ పేరిట ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నగర మేయర్ రవీందర్ సింగ్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఆదివారం నగరపాలక సంస్థ లాంచనాలతో రూ.1 అంతిమయాత్ర అఖరి సఫర్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు […] The post ‘రూపాయికే అంతిమ యాత్ర’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిథి : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు నానా ఇబ్బందులు, అవస్థలు పడే పేదవారికి మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నది కరీంనగర్ బల్దియా. పేదలకు ఆఖరి సఫర్ పేరిట ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నగర మేయర్ రవీందర్ సింగ్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఆదివారం నగరపాలక సంస్థ లాంచనాలతో రూ.1 అంతిమయాత్ర అఖరి సఫర్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌లోని 27వ డివిజన్ భవాని నగర్‌లో మంచాల లలిత మరణంతో పథకం ఆచరణలోకి వచ్చింది. 1 రూపాయి దరఖాస్తుకు చెల్లించి నగరపాలక సంస్థ లాంచనాలతో కార్యక్రమం కొనసాగింది. కడసారి వీడ్కోలు సాంప్రదాయబద్దంగా డప్పుచప్పుల్లు, వాయిద్యాల మధ్య కొనసాగింది. అంతిమ యాత్ర ఆఖరి సఫర్ కార్యక్రమంలో నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, సానిటేషన్ సూపర్ వైజర్ వేణుగోపాల్, నగర పాలక సిబ్బంది పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ పాడెను కట్టి భుజస్కందాలతో మోస్తూ శవయాత్రను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ అంతిమ వీడ్కోలు యాత్ర ఓ సామాజిక బాధ్యత అని అన్నారు. దహన సంస్కారాలు చేయడం దైవ కార్యంతో సమానమని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఆచరణలో పెట్టామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి 1.50 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ధాతల విరాళం కోసం ఒక అకౌంట్‌ను తెరిచామని తెలిపారు. ఒక్క దహన కార్యక్రమానికి 6 నుండి 10 వేల రూపాయల మధ్య ఖర్చు వచ్చిందని స్పష్టం చేశారు. పాడె కర్రతో మొదలుకొని దహన కర్రల వరకు నగరపాలక సంస్థ నిధులను ఖర్చు చేశామన్నారు. సాంప్రదాయంగా చేసే కార్యక్రమాలతో పాటు డప్పుచప్పులను, వాయిద్యాలను కూడా ఏర్పాటు చేసి అంతిమ యాత్ర చేశామని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొని అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ సూపర్‌వైజర్ వేణుగోపాల్, జవాన్ త్యాగరాజు, టిఆర్‌ఎస్ నాయకులు సోహాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Karimnagar town to offer funeral for Re 1 for poor families

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘రూపాయికే అంతిమ యాత్ర’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: