హాట్‌హాట్‌గా రెడ్ మిర్చీ

Red-Mirchi

పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చీ’. కన్నడంలో ‘సిల్క్’ పేరిట విడుదలైన ఈ చిత్రం 25 కోట్లను వసూలు చేసి 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.  పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 28న విడుదల చేయనుంది. ఈ చిత్రాన్ని యంజియం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ “కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయబోతున్నాం”అని అన్నారు. వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాధుకోకిల, అవినాష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరాః జై ఆనంద్, సంగీతంః జెస్సీ గిఫ్ట్, ఎడిటర్‌ః సంజీవ్ రెడ్డి, మాటలు, పాటలుః భారతీబాబు.

Comments

comments