సారీ! నవ్వేశాను

Senator Kamala Harris

 

ట్రంప్ ‘మెంటల్’ అన్న ఓ ఇండియన్
పరిహాసంగా నవ్విన కమలా హారిస్
క్షమాపణ చెప్పిన యుఎస్ సెనేటర్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మానసిక పరిపక్వత లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారా? అని ఒక భారతీయుడు అడగ్గా… సెనేటర్ కమలా హారిస్ పరిహాసంగా నవ్వుతూ ‘బాగా చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ అయిన మొదటి భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ తను చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవి అభ్యర్థి, కాలిఫోర్నియా డెమొక్రాట్ 54 ఏళ్ల కమలా హారిస్ మాట్లాడుతూ ‘నిన్న న్యూ హ్యాంప్‌షైర్ టౌన్ హాల్‌లో మా సిబ్బంది ప్లే చేసిన వీడియో చాలా నిరాశపరిచింది. ఆ సమయంలో ఎవరో ఓ వ్యక్తి అన్న మాటల్ని నేను వినలేదు.

ఒకవేళ నేను విని ఉంటే వెంటనే ఆపి ఉండేదాన్ని, అలా మాట్లాడవద్దని చెప్పేదాన్ని. ఈ విషయంలో క్షమాపణ చెబుతున్నాను. ఆ మాట, అలాంటి మాటలు అనడం తగదు’ అని హారిస్ ట్వీట్ చేశారు. శుక్రవారం ఆ సంఘటన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లండన్ డెర్రీ టౌన్ హాల్ నుంచి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి హారిస్ తల్లి స్వస్థలమైన చెన్నై నుంచి అడిగారు. ‘అమెరికా గురించి కలకన్నాను. అక్కడ ఉండాలని ఎంతో ప్రయత్నించాను. ఆ సమయంలోనే ట్రంప్ ఎన్నికయ్యారు. జాత్యంహకారం ఉన్న వ్యక్తి వైట్‌హౌస్‌కు వచ్చారు. ఒకవేళ మీరే కనక నా రంగులో లేకుంటే మీ దేశం వెళ్లేవారు.

ఈ దేశం గురించి, ప్రజల రంగు గురించి భయపడ్డాను’ అని ఆ వ్యక్తి కామెంట్ చేశాడు. అప్పుడు అతను హారిస్‌తో వచ్చే ఏడాది మీరు ఈ మానసిక రోగి లేకుండా చే సేందుకు మీరేం చేస్తారు?’ అని అడిగాడు. ఆ ప్రశ్న విన్నవారంతా చప్ప ట్లు కొట్టి నవ్వారు. హారిస్ కూడా నవ్వుతూ ‘బాగా చెప్పారు. బాగా చెప్పారు. ధైర్యంగా ఈ సంగతి చెప్పినందుకు ధ్యాంక్స్. దేశంలో చాలామందికి ఈ మాట చెప్పేందుకు భయపడతారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు నేను ప్లాన్ చేస్తున్నాను. ఆ సంగతి తర్వాత చెబుతాను’ అన్నారు.

Kamala For Laughing At Remark On Trump, Apologises

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సారీ! నవ్వేశాను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.