ఆడపిల్లకు వరం కల్యాణ లక్ష్మి పథకం…

Kalyana Lakshmi Scheme

 

నారాయణ పేట : కల్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో పేద ఇంటి ఆడ పిల్లలకు వరమని పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డ్‌ఓ కార్యలయంలో పట్టన, మండలంలోని కల్యాణ లక్ష్మి పథకం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వికలాంగుల పెళ్ళి జరిగితే వారికి సహాయాన్ని మరింత ఎక్కువగా అందింస్తున్నారని తెలిపారు.

ఈ రోజు 81మంది లభ్దిదారులకు చెక్కులను అందిస్తున్నామని అందులో పట్టనానికి సంబదించినవి 48, మండలానికి సంబదించి 33 చెక్కులని అన్నారు. ఈ విడత సహాయం అదించడంలో ఎన్నికల కారణంగా అలస్యం జరిగిందని ఇక నుండి ప్రతి 15రోజులకు ఒక్కసారి చెక్కుల పంపిని చేయాడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఈ పథంకంలో ఆర్థిక సహాయాన్ని పోందేందుకు దళారులను అస్రహించవద్దని నేరుగా అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్డ్‌ఓ శ్రీనివాస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గందే అనుసుయ, ఎంపిపి మనేమ్మ, జడ్ప్‌టిసి అరుణలతో పాటు పట్టన, మండల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kalyana Lakshmi Scheme boon for Young Girls

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆడపిల్లకు వరం కల్యాణ లక్ష్మి పథకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.