బస్ భవన్‌లో కాళోజీ జయంతి వేడుకలు

  హైదరాబాద్ : తెలంగాణ భాష, యాసకు అక్షరాలు అద్దిన మహా కవి కాళోజీ నారాయణరావు ప్రజా పోరాటాలకే జీవితాన్ని ధారపోసి ఆదర్శప్రాయులుగా నిలిచారని టిఆఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఉదయం బస్ భవన్‌లో కాళోజీ నారాయణ రావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపిరి ఉన్నంత వరకు నిరాడంబర జీవితాన్ని గడిపిన మహాన్న వ్యక్తిగా […] The post బస్ భవన్‌లో కాళోజీ జయంతి వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : తెలంగాణ భాష, యాసకు అక్షరాలు అద్దిన మహా కవి కాళోజీ నారాయణరావు ప్రజా పోరాటాలకే జీవితాన్ని ధారపోసి ఆదర్శప్రాయులుగా నిలిచారని టిఆఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఉదయం బస్ భవన్‌లో కాళోజీ నారాయణ రావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపిరి ఉన్నంత వరకు నిరాడంబర జీవితాన్ని గడిపిన మహాన్న వ్యక్తిగా కొనియాడారు. మాతృభాష పై మక్కువతో తెలంగాణ యాసను బతికించేందుకు ఎంతగానో కృషి చేసిన బహుభాషావేత్తగా పేర్కొన్నారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచే విధంగా ఎన్నో కవితలు, పాటలను రచించారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తన కవితల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు అణగారిన వర్గాలను తన రచనల ద్వారా జాగృతం చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణరావుగా శ్లాఘించారు. ఆర్య సమాజ ఉద్యమంలో కాళోజీ గణనీయమైన పాత్ర పోషించారని, ప్రజా ఉద్యమాలె ఊపిరిగా తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన మహనీయుడిగా అభిర్ణించారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయులలో కాళోజీ ప్రముఖంగా నిలుస్తారని పేర్కొన్నారు. కాళోజీ ఆశించిన సమాజ స్థాపనకు అందరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. చివరకు కాళోజీ పార్దీవ దేహాన్ని సైతం కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసి స్పూర్తిగా నిలిచారంటూ కొనియాడారు. మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు పురుషోత్తం, వినోద్, టి.వి.రావు, యాదగిరి, వేంకటేశ్వర్లు, సిపిఆర్‌ఓ జి.కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Kaloji Jayanti Celebrations at Bus Bhawan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బస్ భవన్‌లో కాళోజీ జయంతి వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: