కాళేశ్వరం నీరుతో 5 గ్రామాలు సస్యశామలం

MLA Guvvala Kamalakar

 

కరీంనగర్: కాళేశ్వరం వరదకాలువ ద్వారా కొత్తపల్లి మండలంలోని గ్రామాలకు ప్రత్యేక గ్రావిటి వరదకాలువ పనులు 10 రోజుల్లో పూర్తి అవుతాయని, దీంతో చెరువులు నిండి ఆ గ్రామాలు సస్యశామలం కానున్నాయని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ అన్నారు. గురువారం గంగాధర మండలంలోని అంచపల్లి వరదకలవ వద్ద ఫీడర్ కెనల్ పనులను ఎంపిపి వాసాల రమేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇరిగేషన్ డిపార్టుమెంట్ ద్వారా విడుదలైన జిఒ నంబరు 541 ద్వారా ప్రత్యేక గ్రావిటి ఏర్పాటు చేసి వరద కాలువ ద్వారా 5 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం 2కోట్ల 64 లక్షల 60వేలు మంజురు చేసింది.

భూ సేకరణ కోసం రైతులకు 80 లక్షలు మంజురు చేసి సమారు రైతుల భూములు 7.10 ఎకారల భూమి భూ సేకరణలో పోతుందని, దానికి 80 మంజురు చేసింది. 80 లక్షలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల అచంపల్లి నుండి వరదకాలువ తీయడం అచంపల్లిపై నుండి వచ్చే వరదనీరు ఆరకుండా వరదకాలువ అడ్డు తగ్గులుతుంది. దీంతో కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల, ఆసిఫ్ నగర్, బద్దిపెల్లి, కొండాపూర్, ఎలగందుల, కమాన్ పూర్ గ్రామాలకు వరదనీరు రాక సాగుకు నోచుకొలేదని, దానితో ఆ గ్రామాల రైతులు భూములు అమ్ముకొనే దశకు చేరుకున్నారు. గత ప్రభుత్వ పాలకులు వరదకాలువ వద్ద ఒటి నిర్మించినప్పటికి వరదనీరు రాలేకపోగా చెరువులో నీరు బయటికిపోయే పరిస్థితి ఏర్పాడింది.

నేను ఎంఎల్ఎ అయ్యాక గ్రామాలపై దృష్టి సారించి, వరదకాలువ నిర్మాణం వలన 5 గ్రామాలకు వరదనీరు రాకుండా పోయిందని, వేంటనే ఆ గ్రామల రైతులతో మాట్లాడి, అప్పటి మంత్రులతో మాట్లాడి నిధులు తీసువచ్చామన్నారు. నిధులు వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయని, 10 రోజుల్లో పనులు పూర్తి చేసుకొని ఆ 5 గ్రామాలకు కాళేశ్వరం వరదనీరు ఫీడర్ కెనల్ ద్వారా నాగుల మల్యాల చెరువు నుండి మిగతా గ్రామాల గొలుసుకట్టు చెరువుల ద్వారా ఆసిఫ్ నగర్, బద్దిపెల్లి, కొండాపూర్, ఎలగందుల, కమాన్ పూర్‌ల చెరువులకు చెరి ఈ ప్రాంతం సస్యశామలం కానుంది. ఈ 5 గ్రామాలకు తాగు, సాగునీరు డొకా ఉండదని, ఈ గ్రామాల రైతుల గత దశతాబ్ధాం కళ నేరవేరనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాసాల రమేష్, సాభీర్ పాషా, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Kaleshwaram water for 5 villages in Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం నీరుతో 5 గ్రామాలు సస్యశామలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.