కనుమరుగవుతున్న కాకతీయుల కళావైభవం

    మనతెలంగాణ/వెల్దుర్తి: శిలాలపై శిల్పాలు చెక్కిన వారు మన వాళ్లు. సృష్టికే అందాలు తెచ్చిన వారు అంటు ఓ కవి కాలం నుంచి జాలువారిన అక్షరాలు నిజాన్ని తెలియజేస్తాయి. కాకతీయుల కళలకు నాటికి నేటికి సాటిలేదు. ఆ రాతి స్థంబాలు సరిగమలు పలుకుతాయి. అక్కడి శిల్పాలు జీవం ఉట్టిపడేలా కనిపిస్తాయి. అవి ఒకప్పటి కాకతీయుల కాలం నాటి మాట. కానీ నేడు సరిగమలు పలుకుతాయనుకున్న శిల్పాలు మూగబోయాయి. శిల్పాల కాలమేధస్సు నేడు శిథిలామైంది. మండల కేంద్రమైన […]

 

 

మనతెలంగాణ/వెల్దుర్తి: శిలాలపై శిల్పాలు చెక్కిన వారు మన వాళ్లు. సృష్టికే అందాలు తెచ్చిన వారు అంటు ఓ కవి కాలం నుంచి జాలువారిన అక్షరాలు నిజాన్ని తెలియజేస్తాయి. కాకతీయుల కళలకు నాటికి నేటికి సాటిలేదు. ఆ రాతి స్థంబాలు సరిగమలు పలుకుతాయి. అక్కడి శిల్పాలు జీవం ఉట్టిపడేలా కనిపిస్తాయి. అవి ఒకప్పటి కాకతీయుల కాలం నాటి మాట. కానీ నేడు సరిగమలు పలుకుతాయనుకున్న శిల్పాలు మూగబోయాయి. శిల్పాల కాలమేధస్సు నేడు శిథిలామైంది. మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కళ సంపద, కళాభిమానులను మైమరిపిస్తుంది. 1162లో కాకతీయుల రాజు రుద్రమదేవుడు హన్మకొండలో వెయ్యి స్థంభాల దేవాలయం కట్టించినప్పుడే వెల్దుర్తిలో ఉన్న దేవాలయాలను కట్టించినట్లు ఆధారాలు ఉన్నాయి.

రుద్రమదేవుని హాయంలో ఇలా కళా సంపద వెల్లివిరియడానికి గల కారణం తెలిపే కథ ఒకటి బహుళ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం 12వ శతాబ్దంలో కాకతీయ ప్రోలరాజులు జన్మించిన కుమారుడు తండ్రిని చంపి రాజు అవుతాడని జ్యోతిష్యులు చెప్పడంతో రాజు తన కొడుకును ఏకశీలనగరం ప్రస్తుతం వరంగల్ కోటలోని స్వయంభుదేవాలయంలో వదిలివేయగా సంతానం లేని దేవాలయం అర్చకుడు రుద్రజియో ఆ బాలునకు రుద్రమదేవుడని నామకరణం చేసి పెంచుకున్నాడు. ప్రతిదినం వేకువజామున గుడికి వెళ్లి ప్రోలరాజు యుక్తవయస్సుడైన కుమారునిపై మమకారంతో నిద్రిస్తున్న తనయుడిని ముద్దాడుతాడు. అన్ని విధ్యలు నేర్చుకున్న రుద్రమదేవుడు తన తండ్రిని శత్రువుగా భావించి కత్తితో పోడుస్తాడు. ప్రోలరాజు తుది గడియాలతో రుద్రమదేవునికి రాజుగా పట్టాభిషేకం చేయాల్సిందిగా ఆదేశించి వరమిస్తాడు. తన పితృ హాత్య శవం పోవడానికి రుద్రమదేవుడు తన రాజ్యమంతా తమ కూలీ దైవం అయిన శివుని ఆలయాలను నిర్మింపజేస్తాడు.

అందులో భాగంగానే మండల కేంద్రంలోని శివాలయాలను నిర్మించినట్లు ప్రతీతులు అయితే వెల్దుర్తిలో సుమారు700 సంవత్సరాల కాకతీయుల కాలంలో నిర్మించిన అపురూపమైన శిల్పసంపద, శివాలయాలు,అలాగే సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీక్రిష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. కానీ కాలగమనంలో వచ్చిన మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ఉన్న రాతిస్థంభాలు, మందిరాలుఅప్పటి శిల్పాల నైపున్యానికి ప్రతీకగా కొన్ని ఇప్పటికి నిలిచిఉండగా మరికొన్ని కాలగర్బంలోకి కలిసిపోసి శిథిలమయ్యాయి. ఈ కట్టడాలు ఒక్కటైన కాకతీయసింహద్వారం స్థంభంపై ద్రావిడ బాషలో ఉన్న శాసనం ప్రకారం 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల కాలంలో వెల్దుర్తి మండల అధికారిగా పనిచేసి ఓ అధికారి ఆధ్వర్యంలో ఈ కట్టడాలునిర్మించినట్లు ఉందని పురతత్వ శాఖ అధికారులు తెలిపారు.

వరంగల్‌పట్టణంలో ఉన్న కాకతీయ ద్వారాన్ని పోలి ఉన్న వెల్దుర్తిలోగల సింహద్వారం సుమారు 18అడుగుల ఎత్తు ఉండి పై బాగాన ఆరురంధ్రాలు ఉన్నాయి. అలాగే ద్వారానికి పైన ఒక ప్రక్కన దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరమదనం చేస్తున్న చిత్రం చెక్కి ఉండగా మరో పక్కన శివుడు నాట్యం చేస్తూ హాలహాలం సాగుతున్నట్లు చిత్రం చెక్కి ఉంది. ఈ ద్వారానికి ఎదురుగా ఉన్న శివాలయంలోని గర్బగుడిలోని రంగనాయకులవిగ్రహాం ఉంది. సింహద్వారం పైన గల ఆరురంద్రాల గుండా ఒక్కోక్క రంద్రం నుంచి ఒక్కోక్క రుతువులో సూర్యుని ఉదయ కిరణాలు రంద్రం గుండా వెళ్లి గర్బగుడిలో గల రంగనాయకుల విగ్రహా నాభిపై పడతాయి.

రంగనాయకుల విగ్రహాస్థలంలో పూర్వం శివుని విగ్రహాం ఉండేదని కానీ కాకతీయ రాజుల తర్వాత రాజ్యాదికారానికి శ్రీకృష్ణదేవరాయలు వాటిని వైష్ణవ ఆలయాలుగా మార్చినట్లు ఇక్కడ లభ్యమవుతున్న చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. రంగనాయకుల మందిరం పూర్వం శివాలయం అనడానికి ఈ మందిరం ముందు నుంచి గణపతి, భైరవస్వామి విగ్రహాలుశిథిలమై ఉన్నాయి. ఈ మందిరానికి గుడి కుంట అనే వారు. ప్రస్తుతం అది కూడా కుడిచెరువుగా మారిందని వృద్దులు తెలిపారు. ఇక్కడ పరిసరాల్లో 25 అడుగుల ఎత్తుగల విజయస్థంభం ఉంది.

గరత్మంతుని విగ్రహాం ఉంది గతంలో ఈ స్థంభంపై శివుడి విగ్రహాం ఉండేదని తెలుస్తుంది. శివాలయం, రంగనాయకుల ఆలయం ఆలనపాలనలేకుండా నిరాదరణకు గురవుతున్నాయి. సింహాద్వారం విజయస్థంభం ఒక దీప స్థంభం చెక్క చెదరకుండా వందలాదివిగ్రహాలు, ద్వీపస్థంభాలు శిథిలమై చెత్త కుప్పల మద్య ఉండగా, పలువిగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయాయి. శ్రీక్రిష్ణదేవరాయల కాలంలో నిర్మించిన విఠలేశ్వర ఆలయం కలదు. నాడు నిత్యపూజలతో కళకళలాడిన దేవాలయాలు నేడు పూజలు లేక వెలవెలబోతున్నాయి.

ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాల వైపు కన్ను పెడ్డటంలేదు. పూర్వం ఇవే దేవాలయాల్లో రోజుపూజలు, భజనలు నిర్వహించేవారు. కొందరు సేవాదృక్పదం కలిగిన వారు నూతనదేవాలయాలు నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్న వీటిని మరమ్మత్తు చేయడంతో ఆసక్తి కనబరచడంలేదు. పూర్వీకులు ప్రతిష్టించిన విగ్రహాలకు నేడు పూజలుకరువయ్యాయి. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఈ ఆలయ ఆవరణలో రథంను ఉంచేందుకు ఎత్తైన షెడ్డు నిర్మించారు. ఒకప్పుడు నిత్య పూజలతో ఎంతో శోభను ఇచ్చిన ఈ దేవాలయాల్లో నేడు దాని ఛాయలోకి కూడా వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘసేవకులు దేవాలయాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

వెలుతురు నుంచి వెల్దుర్తి

18 అడుగుల ఎత్తు నుంచి పైభాగాన ఆరు రంధ్రాలు ఉన్నాయి. సింహద్వారం పైన గల ఆరు రంధ్రాల గుండా ఒక్కోక్క రంధ్రం నుంచి ఒక్కోక్క రుతువులో సూర్యుని ఉదయ కిరణాలు గర్బగుడిలోకి వెళ్లి రంగనాయకుల విగ్రహాం నాభిపైన సూర్యుని కిరణాలు పడతాయి. దీంతో గతంలో వెలుతురు ఉన్న పేరు కాలక్రమేణ వెల్దుర్తిగా మారిందని గ్రామ పెద్దలు అంటున్నారు.

 

Kakatiya Story in Telugu

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: