మెగాస్టార్‌తో రెండోసారి

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ కాన్సెప్ట్‌తో కూడిన కమర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా త్రిషని అనుకున్నారు. ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా కొద్దిరోజుల క్రితం చిరంజీవి మూవీ నుండి బయటికి వెళ్లిపోతున్నట్లు త్రిష అధికారికంగా ప్రకటించేసింది. దీంతో చిరు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో అనేక ఊహాగానాలు బయటికి రావడం జరిగింది. అయితే […] The post మెగాస్టార్‌తో రెండోసారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ కాన్సెప్ట్‌తో కూడిన కమర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా త్రిషని అనుకున్నారు. ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా కొద్దిరోజుల క్రితం చిరంజీవి మూవీ నుండి బయటికి వెళ్లిపోతున్నట్లు త్రిష అధికారికంగా ప్రకటించేసింది. దీంతో చిరు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో అనేక ఊహాగానాలు బయటికి రావడం జరిగింది. అయితే ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా నిరూపితమైంది. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు దీనిపై స్పష్టత ఇచ్చింది. గతంలో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Kajal aggarwal opposite to Chiranjeevi 152 movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెగాస్టార్‌తో రెండోసారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: