వామ్మో.. ఆ హోటల్‌కు వెళితే అంతే!

Rahul-Boseముంబై: ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏ వస్తువైనా బయట కనా చాలా ఖరీదన్న విషయం తెలుసు కాని మరీ ఇలా నిలువు దోపిడీ చేస్తారన్న విషయం ఇప్పుడే తెలిసింది అంటున్నాడు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్. కమల్ హాసన్ నిర్మించి నటించిన విశ్వరూపం 2 చిత్రంతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ది జపనీస్ వైఫ్, దిల్ దడక్నే దో తదితర చిత్రాలలో నటించిన రాహుల్ బోస్ ఇటీవల చండీగఢ్‌లోని జెడ్లూ మారియట్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన తర్వాత రెండు అరటిపండ్ల్లు ఆర్డర్ చేశాడు. అవి తిని రూమ్‌కు వచ్చేసరికి బిల్లు చేతికి వచ్చింది.

బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయి రాహుల్‌కు. జత అరటి పండ్లకు అక్షరాలా రూ. 442.50 బిల్లు వడ్డించారు. నిజానికి తాజా పండ్లకు, సలాడ్‌గా తయారు చేయని పండ్లకు జీఎస్‌టి వేయకూడదు. కాని..రెండు అరటి పండ్లకు కూడా జీఎస్‌టి తగిలించారు. దీంతో బిత్తరపోయిన రాహుల్ బోస్ ఎరక్క పోయి తిన్నానే అని వాపోవడంతోపాటు రోడ్డు మీదకు వచ్చి తింటే మహా అయితే పది రూపాయలు అయ్యే వాటికి నిలువుదోపిడీ చేశారంటూ బాధపడుతున్నాడు. ఇదే విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా రాహుల్‌పై సానుభూతి వర్షం కురిపించడం విశేషం.

JW Marriot hotel charges Rs 443.5 for two bananas, Actor Rahul Bose was shocked when the five star hotel in Chandigarhl sent the bill

The post వామ్మో.. ఆ హోటల్‌కు వెళితే అంతే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.