క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి

  నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ (29) కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్‌ వైద్య చికిత్సను అందించి 108 అంబులెన్స్‌లో ఆయనను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే సురేశ్‌ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సురేశ్‌ స్వస్థలం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం […] The post క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ (29) కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్‌ వైద్య చికిత్సను అందించి 108 అంబులెన్స్‌లో ఆయనను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే సురేశ్‌ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సురేశ్‌ స్వస్థలం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి గ్రామం. రెండేండ్ల క్రితం విజయవాడకు చెందిన లావణ్యను ఆయన వివాహం చేసుకున్నాడు. 2018 నుంచి మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని టీఎన్‌జీవోస్‌ జిల్లా నాయకులు పరామర్శించారు.

Junior Panchayat Secretary dies

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.