జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు ఇటీవల తీర్పు చెప్పారు. జీవో 74ను ఉమ్మడి ఏపీలో 2012లో జారీ అయిందని, దాని ప్రకారమే స్పోరట్స్ కోటా కింద 176 పోస్టులను భర్తీ చేస్తామని గతంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హైకోర్టుకు ఇచ్చిన హామీని ధిక్కరించారని శ్రీనివాస్ మరో ఇద్దరు కోర్టు […] The post జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు ఇటీవల తీర్పు చెప్పారు. జీవో 74ను ఉమ్మడి ఏపీలో 2012లో జారీ అయిందని, దాని ప్రకారమే స్పోరట్స్ కోటా కింద 176 పోస్టులను భర్తీ చేస్తామని గతంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హైకోర్టుకు ఇచ్చిన హామీని ధిక్కరించారని శ్రీనివాస్ మరో ఇద్దరు కోర్టు ధిక్కార రిట్ వేశారు. 98 పోస్టుల భర్తీ చెల్లదు. స్పోరట్స్ కోటా కింద భర్తీ చేసే పోస్టులను అర్హత సాధించాలంటే అర్హత మార్కులు 35 ఉండాలని జీవో 74 స్పష్టం చేస్తోంది. అయితే జీవోలోని అంశాల్ని పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. కాబట్టి 98 పోస్టుల భర్తీ చెల్లదు. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలి. 3 నెలల్లోగా తిరిగి ఆ పోస్టులను భర్తీ చేయాలి.. అని హైకోర్టు తీర్పు చెప్పింది.

 

Junior Panchayat Secretary Appointment is invalid

The post జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.