ఆ సీన్స్ లో ప్రేక్షకులు విజిల్స్ వేస్తారట..!

యంగ్ టైగర్ ఎన్ టిఆర్  హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలైన ఆడియోకు కూడా శ్రోతులను ఆటకట్టుకుంటుంది. దీంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తారక్ మాస్ […]

యంగ్ టైగర్ ఎన్ టిఆర్  హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలైన ఆడియోకు కూడా శ్రోతులను ఆటకట్టుకుంటుంది. దీంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తారక్ మాస్ హీరోగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర యూనిట్ విడుదల తేదీతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో ఉన్న అరవింద సమేత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ఇటలీ సాంగ్ షూట్ పూర్తి చేసుకుని అరవింద బృందం త్వరలోనే హైదరాబాద్ కి రానుంది.

కాగా, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ బాబు, జగపతి బాబు ఫ్యాక్షన్ నాయకులుగా కనిపిస్తారని సమాచారం. ఊరి బాగు కోసం ఫ్యామిలీని సైతం లెక్కచేయని గ్రామ పెద్దగా మెగా బ్రదర్ నాగబాబు, తనేం అనుకున్నాడో అది చేసే క్రూరత్వం ఉన్న వాడిగా జగపతి బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలిసింది. అయితే ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. అందులోనూ ఈ చిత్రంలో స్థానిక ఎన్నికలకి సంబంధించిన ఒక ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని, ఈ ఎపిసోడ్ లో తారక్ తో ముడిపడిన సీన్స్ అదిరిపోనున్నాయట. ఈ సన్నివేశాలను మాటల మాంత్రికుడు ప్రేక్షకులు విజిల్స్ వేసేలా చిత్రీకరించాడని చిత్ర బృందం చెబుతోంది.  త్వరలోనే  ‘అరవింద సమేత’  ఫ్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: