జర్నలిస్టుల ఆధ్వార్యంలో ధర్నా…

నర్సాపూర్ : టిపిసిసి కార్యదర్శి నాగేష్ ,విలేకరుల సమావేశం ఉందంటూ పిలిచాక, చిన్న పత్రికల వారే వచ్చారు అంటు, పత్రికలపై హేళనగా మాట్లాడటంతో, అందుకు నిరసనగా నర్సాపూర్ కలం కార్మికులు, మంగళవారం నాడు నిరసన గా ధర్నా కార్యక్రమం చేపట్టారు. వివరాల్లో కి వెళ్లితే ఏప్రిల్ 29 న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, టిపిసిసి కార్యాదర్శి నర్సాపూర్ వచ్చిన సందర్భంలో, విలేకరుల సమావేశం ఉందంటు నాయకులు సమాచారం ఇవ్వడంతో, కొంత మంది విలేకరులు కంగ్రెస్ పార్టి […] The post జర్నలిస్టుల ఆధ్వార్యంలో ధర్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నర్సాపూర్ : టిపిసిసి కార్యదర్శి నాగేష్ ,విలేకరుల సమావేశం ఉందంటూ పిలిచాక, చిన్న పత్రికల వారే వచ్చారు అంటు, పత్రికలపై హేళనగా మాట్లాడటంతో, అందుకు నిరసనగా నర్సాపూర్ కలం కార్మికులు, మంగళవారం నాడు నిరసన గా ధర్నా కార్యక్రమం చేపట్టారు. వివరాల్లో కి వెళ్లితే ఏప్రిల్ 29 న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, టిపిసిసి కార్యాదర్శి నర్సాపూర్ వచ్చిన సందర్భంలో, విలేకరుల సమావేశం ఉందంటు నాయకులు సమాచారం ఇవ్వడంతో, కొంత మంది విలేకరులు కంగ్రెస్ పార్టి కార్యాలయానికి చేరుకోగా, టిపిసిసి కార్యదర్శి నాగేష్, పత్రికలను హేళన చేసినట్టుగా చిన్నపత్రికల వారే వచ్చారా, పెద్దపత్రికల వారు రాలేదా అని మాట్లాడటంతో, వారి వాఖ్యలకు నిరసనగా అక్కడికి వచ్చిన కలం కార్మికులు నిరసనగా బయటకు రావడం జరిగింది.

నాగేష్ మాటలను అవమానంగా భావించిన కలం కార్మికులు మంగళవారం నాడు, అంబేద్కర్ చౌరస్తాలో నిరస ధర్నాను చేపట్టారు. విలేకరుల నిరసన ధర్నాను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ధర్నా స్థలానికి చేరుకుని పత్రిక సోదరులకు సానుభూతి తెలుపుతూ, ధర్నాకు మద్దతు తెలిపారు. అదేవిదంగా వివిద పార్టీల నాయకులు కూడ, కలం కార్మికులకు మద్దతుగా ధర్నా స్థలానికి చేరుకుని సానుభూతి తెలియ జేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, ధర్నా స్థలానికి చేరుకుని క్షమాపణ తెలుపుకుంటున్నామని చేప్పినా, పత్రిక సోదరులు మాత్రం, నాగేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కలం కార్మికుల ఐక్యతను చాటారు.

హేళనగ మాట్లాడిన నాగేష్ వచ్చి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిరసన మరింత ఉదృతం చేయనున్నామని పత్రిక సోదరులు తెలిపారు. అందుకు స్పందించిన కాంగ్రెస్ నాయకులు నాగేష్ తో పోన్‌లో మాట్లాడి, ఒక్కటి రెండు రోజుల్లో నర్సాపూర్ వస్తున్నడని, అదేరోజు వారి తోనే క్షమాపణ చెపిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలుపడంతో, కలం కార్మికులు శాంతించి ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో బిక్షపతి, నర్సింహరెడ్డి, రాజుగౌడ్, శ్రీనివాస్, సుధాకర్, భిక్షపతి, ఆనంద్, కరీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Journalists are protesting

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జర్నలిస్టుల ఆధ్వార్యంలో ధర్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.