జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

  మనతెలంగాణ : ఖమ్మం జిల్లాలోని మధిరలో వివిధ పత్రికలు, చానళ్ల విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యుఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలంపల్లి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ నింబంధనలను ఉల్లఘించి ప్రభుత్వ అతిధి గృహంలో అధికారులు మద్యం సేవిస్తున్న విషయాన్ని వెలుగులోకి తీసురావడం జర్నలిస్టుల తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని ఆయన అన్నారు. రాత్రి వేళ సబ్ జైలర్ […] The post జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ : ఖమ్మం జిల్లాలోని మధిరలో వివిధ పత్రికలు, చానళ్ల విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యుఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలంపల్లి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ నింబంధనలను ఉల్లఘించి ప్రభుత్వ అతిధి గృహంలో అధికారులు మద్యం సేవిస్తున్న విషయాన్ని వెలుగులోకి తీసురావడం జర్నలిస్టుల తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని ఆయన అన్నారు. రాత్రి వేళ సబ్ జైలర్ అతిధి గృహంలో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అతిధి గృహంలో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయనే సమాచారంతోనే అక్కడకు విలేఖర్లు వెళ్లారని, అది ప్రైవేట్ వ్యక్తులకు సంబందించింది కాదని అందులో మద్యం సేవిస్తుంటే అక్కడకు వెళ్లడం నేరం ఏలా అవుతుందని ఆయన అన్నారు. నిజంగా లాక్‌డౌన్ నింబంధనలు ఉల్లఘించకపోతే సంబంధిత అధికారులను ఎందుకు సస్పెండ్ చేసినట్లని ఆయన ప్రశ్నించారు. పోలీసులు జర్నలిస్టుల పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

 

Journalist cases are lift demanded by TUWIJU in KMM

 

Journalist cases are lift demanded by TUWIJU in KMM

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: