ఆర్థిక అధికారం ఆరంభం…

  నల్లగొండ : పల్లెల ప్రగతికి మార్గం సుగమమైంది. పదవి బాధ్యతలు చేపట్టి ఇంతకాలమైనా చెక్‌పవర్ లేకపోవడంతో మౌళిక అవసరాలు తీర్చేందుకు అవస్థలు పడ్డ సర్పంచ్ లకు ఉమ్మడి చెక్‌పవర్‌కు సంబందించి ఉత్తర్వులు జారీ చేయడంతో ఊరట కల్గింది. 2018పంచాయతీరాజ్‌చట్టంలో మార్పుల అనుగుణంగా ఎట్టకేలకు సర్పంచి, ఉప సర్పంచిలకు జాయింట్ చెక్‌పవర్ కల్పించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1713గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం నుంచే ఉమ్మడి జిల్లాలోని […] The post ఆర్థిక అధికారం ఆరంభం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ : పల్లెల ప్రగతికి మార్గం సుగమమైంది. పదవి బాధ్యతలు చేపట్టి ఇంతకాలమైనా చెక్‌పవర్ లేకపోవడంతో మౌళిక అవసరాలు తీర్చేందుకు అవస్థలు పడ్డ సర్పంచ్ లకు ఉమ్మడి చెక్‌పవర్‌కు సంబందించి ఉత్తర్వులు జారీ చేయడంతో ఊరట కల్గింది. 2018పంచాయతీరాజ్‌చట్టంలో మార్పుల అనుగుణంగా ఎట్టకేలకు సర్పంచి, ఉప సర్పంచిలకు జాయింట్ చెక్‌పవర్ కల్పించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1713గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులు పరుగులు పెట్టనున్నాయి.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం నుంచే ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల్లో అమలులోకి వచ్చాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1720పంచాయతీలు ఉండగా, అందులో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పరిధిలోని 7పంచాయతీలకు ఎన్నికలు జరుగకపోగా 1713పంచాయతీల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ జిల్లాలో 844పంచాయతీలకు గాను 837పంచాయతీలకు, సూర్యాపేట జిల్లాలోని 475పంచాయతీలు, యాదాధ్రిభువగిరి జిల్లాలోని 401పంచాయతీలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరిని నేపధ్యంలో తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉమ్మడి చెక్‌పవర్ ఉత్తర్వులు సదరు పాలకవర్గాలకు ఊరటకల్గించనున్నాయి.

ఆయా పల్లెల్లో అభివృద్ది పనులు పరుగులు పెట్టనుండగా, ఆర్ధిక సంఘం నిధులతో పాటు వివిద రకాల నిధులు గత కొన్ని నెలలుగా పంచాయతీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చెక్‌పవర్ కల్పించడంపై పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఉపసర్పంచ్‌లతో కలిపి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పలువురు సర్పంచిలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా నిబందనలు కఠినతరం కానున్నాయి.

తాజా నిబందనలు మరింత కఠినతరం….గ్రామ పంచాయతీల్లో సమకూరే ఆదాయం, వ్యయం వివరాలను సర్పంచి, పంచాయతీ కార్యదర్శి కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సర్పంచి, ఉపసర్పంచికి ఉమ్మడి చెక్‌పవర్ ఇచ్చినా ఆర్డర్‌లు జారీ చేసే అధికారం మాత్రం కేవలం సర్పంచిలకే ఉంటుంది. లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా సర్పంచితో పాటు కార్యదర్శిని కూడా విధుల నుంచి తొలిగించేలా కఠినమైన నిబందనలు పొందుపర్చారు. సదరు విషయంలో సర్పంచి, కార్యదర్శి తమకు అన్యాయం జరిగిందని భావిస్తే 30రోజుల్లో పంచాయతీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గ్రామ పంచాయతీల నివేదికలు, తీర్మానాలను విధిగా నోటీసు బోర్డుపై లిఖించడమే కాకుండా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుండగా, విఫలమైతే కార్యదర్శిపై చర్యలు ఉంటాయి.

అనుమతులన్ని ఇకపై ఆన్‌లైన్‌లోనే….గతంలో మాదిరిగా పంచాయతీల్లో అనుమతులు పాదర్శకంగా ఉండట్లేదన్న ఆరోపణలు కోకొల్లలుగా ఉండేవి. పాత అనుభవాలతో నిబందనల్లో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు. పంచాయతీల్లో కూడా లే అవుట్‌లు, భవన నిర్మాణాల అనుమతులు ఇకపై ఆన్‌లైన్‌తోనే ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.

గ్రామ సభల నిర్వహణకు ‘కోరం’ తప్పనిసరి...పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ఇక నుంచి తప్పనిసరిగా కనీస కోరం ఉండాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సభల్లో 500వరకు ఓటర్లు ఉండే పంచాయతీల్లో గ్రామ సభకు కనీసం 50మంది హాజరయ్యేలా, వెయ్యిలోపు ఓటర్లుంటే 75మంది, 3వేల వరకు 150మంది, 5వేల మంది ఉంటే 200మంది, పదివేల మంది ఉంటే 400మంది హాజరయ్యేవిదంగా చూడాల్సి ఉంటుంది.

ఉపసర్పంచ్‌తో చెక్‌పవర్‌పై సర్పంచ్ పెదవివిరుపు…సర్పంచి, ఉపసర్పంచికి ఉమ్మడి చెక్‌పవర్ కల్పించడం పట్ల సర్పంచ్‌లు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరి మధ్య సఖ్యత లేనియెడల అభివృద్దికి ఆటంకం కల్గుతుందన్న భావన కొంతమంది సర్పంచ్‌లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరగా పంచాయతీ కార్యదర్శితో కలిపి ఉండగా, ప్రస్తుతం ఉపసర్పంచ్‌తో కలపడం వల్ల పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు. ఉమ్మడి చెక్‌పవర్ విషయంలో గతంలో మాదిరిగానే కార్యదర్శితో కూడిన చెక్‌పవర్‌ను అమలు చేయాలని కోరుతున్నారు.

Joint Cheque Power given to Sarpanch and sub-Sarpanch

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్థిక అధికారం ఆరంభం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.