రూ. 251తో జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫర్

  ముంబయి : కరోనాను కట్టడి చేసేందుకు పలు కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటివద్దనుంచే పని చేయడానికి అనుమతిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ సరికొత్త ‘ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదదారులు ప్రతి రోజూ రెండు జిబి డేటాను వినియోగించుకోవచ్చు. దీని కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది. అపరిమిత డేటాను వినియోగించుకున్న తర్వాత 64 కెబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్‌లో […] The post రూ. 251తో జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి : కరోనాను కట్టడి చేసేందుకు పలు కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటివద్దనుంచే పని చేయడానికి అనుమతిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ సరికొత్త ‘ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదదారులు ప్రతి రోజూ రెండు జిబి డేటాను వినియోగించుకోవచ్చు. దీని కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది. అపరిమిత డేటాను వినియోగించుకున్న తర్వాత 64 కెబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్‌లో సందేశాలు పంపుకొనే, కాల్స్ చేసుకునే సదుపాయాలు ఉండవు.

కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. ఇంతకు ముందు బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇలాంటి ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్త కనెక్షన్ తీసుకునే వారికి నెల రోజులు ఉచితంగా బ్రాడ్‌బ్యాడ్ సేవలు అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్స్‌లో ఉండే వారు ఇకపై అప్‌గ్రేడ్ చేసుకొని ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్ చేసుకునేందుకు టాక్‌టైమ్ సొందవచ్చని సంస్థ తెలిపింది. రూ.11, రూ.21,రూ.51,రూ.101తో రీచార్జ్ చేయించుకునే వారికి 800 ఎంబి,2 జిబి, 6 జిబి,12 జిబి హైస్పీడ్ డేటా లభిస్తుంది. వరసగా 75,200, 500, 700 నిమిషాల టాక్‌టైమ్ పొందవచ్చు.

Jio launches Work From Home Pack for RS 251

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ. 251తో జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: