జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్..

మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ ఇంటి నుంచి తమతమ సంస్థల విధులను నిర్వహించే వారికి ఒక కొత్త ఆలోచన చేసి ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఇంటర్‌నెట్ వినియోగదారులు రోజుకు 2 జిబి డేటా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌లో నెట్ వినియోగించుకునేందుకు […] The post జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ ఇంటి నుంచి తమతమ సంస్థల విధులను నిర్వహించే వారికి ఒక కొత్త ఆలోచన చేసి ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఇంటర్‌నెట్ వినియోగదారులు రోజుకు 2 జిబి డేటా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌లో నెట్ వినియోగించుకునేందుకు కాలపరిమితిగా 51 రోజులను ప్రకటించింది. ధర రూ. 251లుగా ఖరారుచేసింది. వినియోగదారులు అపరమిత డేటాను వినియోగించుకున్న అనంతరం 64 కెబిపిఎస్ వేగంతో ఇంటర్‌నెట్‌ను పొందవచ్చని జియో సంస్థ వెల్లడించింది. వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్‌లో మాత్రం సందేశాలు పంపుకోవడం, కాల్స్ చేసుకునే సదుపాయాలు లేవని స్పష్టంచేసింది.

కేవలం డేటా మాత్రమే లభిస్తుందని, ఇంతకుముందే బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ వర్క్ ఫ్రం హోమ్ వారికి ప్రత్యేకంగా ఓ ప్రణాళికను ప్రకటించిన విషయం విదితమే. కొత్తగా నెట్ కనెక్షన్ తీసుకునే వారికి ఒక నెల ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్‌లో ఉన్నవారు ఇకముందు అప్‌గ్రేడ్ చేసుకుని ఇతర నెట్ వర్క్‌లకు ఫోన్ చేసుకునేందకు టాక్‌టైమ్‌ను పొందే అవకాశాన్ని సంస్థ కల్పించింది. రూ. 11లకు 800 ఎంబి అధిక వేగం డేటా, 75 ని.ల టాక్‌టైమ్, రూ. 21 2 జిబి డేటా, 200 ని.ల టాక్‌టైమ్, రూ. 51 6.జిబి డేటా, 500 ని.ల టాక్‌టైమ్, రూ. 101లతో రీ చార్జ్ చేసుకునే వారికి 12 జిబి డేటా, 1000 ని.ల టాక్ టైమ్‌ను పొందవచ్చని సంస్థ వివరించింది.

Jio Launches ‘Work From Home’ Offer with Rs.251

The post జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: