దాణా స్కాంలో లాలూకు బెయిల్

  రాంచీ: పశువుల దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 71 ఏళ్ల లాలూప్రసాద్ ఇదే కేసులో మూడున్నర సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వయోభారంవల్ల ఆరోగ్యం క్షీణిస్తున్నందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జూన్‌లో లాలూ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనపై జూలై 12న విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఇదే దాణా కుంభకోణంలో మరో మూడు ఇతర కేసుల్లో వివిధ […] The post దాణా స్కాంలో లాలూకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంచీ: పశువుల దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 71 ఏళ్ల లాలూప్రసాద్ ఇదే కేసులో మూడున్నర సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వయోభారంవల్ల ఆరోగ్యం క్షీణిస్తున్నందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జూన్‌లో లాలూ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనపై జూలై 12న విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఇదే దాణా కుంభకోణంలో మరో మూడు ఇతర కేసుల్లో వివిధ కారణాలతో ఆయనకు జైలు శిక్ష విధించారు. అక్రమ నగదు చెలామణికి సంబంధించిన దాణా కుంభకోణం చోటు చేసుకుంది. లాలూప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి రూ 9.4 బిలియన్లు అపహరించబడింది.

Jharkhand HC grants bail to Lalu in Fodder scam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దాణా స్కాంలో లాలూకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: