జాన్వీ ‘బెల్లీ డ్యాన్స్’చూశారా…(వైరల్ వీడియో)

 

ముంబయి: ధఢక్‌ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. తన అందంతో తొలి సినిమాతోనే అభిమానుల మనుసును కొల్లగొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం`త‌క్త్‌`అనే సినిమాలో నటిస్తుంది.ఇక, జిమ్‌కు వెళ్లే స‌మ‌యంలో పొట్టి దుస్తుల‌తో దర్శనమిస్తూ సోష‌ల్ మీడియా ద్వారా మంచి క్రేజే సొంతం చేసుకుంది.

తాజాగా ‘డ్యాన్స్ దీవానే 2’ ఛాలెంజ్‌ను స్వీకరించిన జాన్వీ తనదైన స్టైల్‌లో బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆమె చేసి నృత్యానికి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారమయే డ్యాన్స్ దీవానే 2 ఛాలెంజ్ రియాలిటీ షోకు మాధురీ దీక్షిత్, శశాంక్ కైతాన్ (ధడక్ డైరెక్టర్)జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోను ప్రమోట్ చేసేందుకు షో థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జాన్వీకపూర్, ఇషాన్‌కట్టర్, వరుణ్‌ధావన్‌కు శశాంక్ కైతాన్ ఛాలెంజ్ విసిరాడు.

Jhanvi kapoor belly dance viral video

The post జాన్వీ ‘బెల్లీ డ్యాన్స్’ చూశారా…(వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.