ప్రపంచంలోనే ఖరీదైన విడాకుల భరణం

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజాస్ భార్య మెక్‌కెన్జీకి గతంలో ఎవ్వరూ, ఎక్కడా తీసుకోనంత భారీ విడాకుల భరణం లభించనున్నది. 26 ఏళ్ల పాటు జెఫ్ బెజాస్‌తో కాపురం చేసి నలుగురు పిల్లలకు తల్లి కూడా అయిన 49 సంవత్సరాల మెక్‌కెన్జీకి 38 బిలియన్ డాలర్లు భరణంగా దక్కనున్నాయి. సీటెల్‌లో ఒక చిన్న కారు గెరేజ్‌లో అమెజాన్‌ను ప్రారంభించడానికి ఏడాది ముందు 1993లో జెఫ్‌ను మెక్‌కెన్జీ పెళ్లి చేసుకున్నారు. తనకు లభించే […] The post ప్రపంచంలోనే ఖరీదైన విడాకుల భరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజాస్ భార్య మెక్‌కెన్జీకి గతంలో ఎవ్వరూ, ఎక్కడా తీసుకోనంత భారీ విడాకుల భరణం లభించనున్నది. 26 ఏళ్ల పాటు జెఫ్ బెజాస్‌తో కాపురం చేసి నలుగురు పిల్లలకు తల్లి కూడా అయిన 49 సంవత్సరాల మెక్‌కెన్జీకి 38 బిలియన్ డాలర్లు భరణంగా దక్కనున్నాయి. సీటెల్‌లో ఒక చిన్న కారు గెరేజ్‌లో అమెజాన్‌ను ప్రారంభించడానికి ఏడాది ముందు 1993లో జెఫ్‌ను మెక్‌కెన్జీ పెళ్లి చేసుకున్నారు. తనకు లభించే సంపదలో సగం డబ్బును వారెన్ బఫెట్, బిల్ గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందచేస్తానని ప్రపంచంలో నాలుగవ అత్యంత ధనవంతురాలు కానున్న మెక్‌కెన్జీ ఇదివరకే ప్రకటించారు. తన భార్యకు ఇంత భారీ మొత్తంలో భరణం చెల్లించిన తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా 118 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ కొనసాగనుండడం విశేషం. తనను మోసం చేశాడన్న కారణంతో 55 ఏళ్ల జెఫ్‌తో వైవాహిక సంబంధాన్ని తెంచుకోవాలని మెక్‌కెన్జీ గత జనవరిలోనే నిర్ణయించుకున్నారు. ఈ జంట మధ్యకుదిరిన ఒప్పందం మేరకు ఈ వారంలోనే వీరి వైవాహిక జీవితానికి తెరపడనున్నది.
Amazon founder Jeff Bezos wife to get biggest divorce settlement, MacKenzie Bezos to get 38 Billion dollars as divorce settlement

The post ప్రపంచంలోనే ఖరీదైన విడాకుల భరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.