జెఇఇ అడ్వాన్స్ పరీక్ష వాయిదా

మే 27కు జెఇఇ అడ్వాన్స్‌డ్ వాయిదా హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్సుడ్ పరీక్ష మే 27వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఐఐటి రూర్కీ అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను మే 19వ తేదీన జరుపుతామని గత నవంబరులోనే ప్రకటించారు. అదే రోజు లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ఉండటంతో అడ్వాన్సుడ్ పరీక్షను మే 27వ తేదీన నిర్వహించాలని ఐఐటీ రూర్కీ నిర్ణయించింది. జెఇఇ మెయిన్‌లో వచ్చిన […]

మే 27కు జెఇఇ అడ్వాన్స్‌డ్ వాయిదా

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్సుడ్ పరీక్ష మే 27వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఐఐటి రూర్కీ అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను మే 19వ తేదీన జరుపుతామని గత నవంబరులోనే ప్రకటించారు. అదే రోజు లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ఉండటంతో అడ్వాన్సుడ్ పరీక్షను మే 27వ తేదీన నిర్వహించాలని ఐఐటీ రూర్కీ నిర్ణయించింది. జెఇఇ మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి దేశవ్యాప్తంగా 2.24 లక్షల మందికి అడ్వాన్సుడ్ రాయడానికి అవకాశం ఇస్తారు.

JEE Advanced Exam Postponed To May 27

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: