భద్రాది కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీల్లో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తుండగా సుక్మా జిల్లాలో బాంబ్ బ్లాస్ట్ అయి ఓ జవాను మృతి చెందగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఫూల్బగ్డీ,కేరళాపాల్ దండకారణ్యంలో డిఆర్జీ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కేరళాపాల్ అటవీ ప్రాంతంతో జవాన్లను టార్గెట్ చేస్తూ అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైస్ ను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో జనాధర్ ప్రధాని, ఫూల్‌చంద్ బగోలి, కమల్ మాండవి, వీరేంద్రనాగ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన జిల్లా కేంద్రానికి తరలించారు. గాయపడిన జనాధర్ ప్రధాని పరిస్థితి విషమించి ఆసుపత్రిలో మృతి చెందాడు.
Comments
comments