జపాన్ అభిమానుల సందడి

  ‘బాహుబలి’ విజయం తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో యూనివర్సల్ హీరో అయిన అతనికి దేశ, విదేశాల్లో భారీగా అభిమానులున్నారు. ఇక జపాన్‌లో కూడా ప్రభాస్‌కు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. గతంలో ఒకసారి జపాన్ ఫ్యాన్స్ ప్రభాస్ ఇంటి ముందు నిలబడి ఫోటోలు తీయించుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయింది. జపాన్‌కు చెందిన పది మంది అమ్మాయిలు, మహిళలు ప్రభాస్ కోసం హైదరాబాద్ వచ్చారు. వాళ్లందరూ ప్రభాస్ […] The post జపాన్ అభిమానుల సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘బాహుబలి’ విజయం తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో యూనివర్సల్ హీరో అయిన అతనికి దేశ, విదేశాల్లో భారీగా అభిమానులున్నారు. ఇక జపాన్‌లో కూడా ప్రభాస్‌కు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. గతంలో ఒకసారి జపాన్ ఫ్యాన్స్ ప్రభాస్ ఇంటి ముందు నిలబడి ఫోటోలు తీయించుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయింది. జపాన్‌కు చెందిన పది మంది అమ్మాయిలు, మహిళలు ప్రభాస్ కోసం హైదరాబాద్ వచ్చారు. వాళ్లందరూ ప్రభాస్ ఇంటి గేటు ముందు నిలబడి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఫోటోకు పోజిచ్చారు.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో జపాన్ అమ్మాయిలు, మహిళల ఉత్సాహం చూస్తుంటేనే వారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. ఈ స్టార్ హీరో ఇంటిని చూస్తేనే వారు ఆవిధంగా ఎగ్జైట్ అయితే.. ప్రభాస్‌ను కలిస్తే ఎలా ఉంటుందో. గతంలో రజనీకాంత్ కోసం ఇలా జపాన్ లాంటి దేశాలనుండి అభిమానులు భారతదేశానికి వచ్చేవారు. ఇప్పుడు ప్రభాస్ కోసం అదే రేంజ్ లో జపాన్ అభిమానులు వస్తున్నారు. ఈ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ను భారతీయ భాషలతో పాటుగా జపనీస్ లాంటి విదేశీ భాషలలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Japanese fans dance before Prabhas house

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జపాన్ అభిమానుల సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: