‘కాంగ్రెస్ పతనానికి జైపాల్‌రెడ్డే కారణం’

మన తెలంగాణ / దేవరకద్ర: ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం పార్టీ సీనియర్లే అని అందులో జిల్లా నుంచి ఉన్న పెద్ద మనిషి మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మొదటి వ్యక్తి అని కాంగ్రెస్ నేత డోకూర్ పవన్‌కుమార్ విమర్శించారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డోకూర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు టికెట్లు రానీయకుండా చేసి తన మాట నెగ్గాలనే పంతంతో ఓడిపోయేవాళ్లకు టికెట్లు కేటాయించి పార్టీ పతనానికి […]

మన తెలంగాణ / దేవరకద్ర: ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం పార్టీ సీనియర్లే అని అందులో జిల్లా నుంచి ఉన్న పెద్ద మనిషి మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మొదటి వ్యక్తి అని కాంగ్రెస్ నేత డోకూర్ పవన్‌కుమార్ విమర్శించారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డోకూర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు టికెట్లు రానీయకుండా చేసి తన మాట నెగ్గాలనే పంతంతో ఓడిపోయేవాళ్లకు టికెట్లు కేటాయించి పార్టీ పతనానికి కారణమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డి.కె.అరుణ అనుచరులమనే ఉద్దేశంతో పార్టీ నుంచి తనని తెలియకుండానే సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

గత రెండు రోజుల క్రితం పత్రికా మాధ్యమాల ద్వారా తాను ఏ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నప్పటికీ తనని సంప్రదించకుండానే షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే సస్పెన్షన్ ఆర్డర్‌ను పత్రికలకు లీక్ చేయడం ఏంటని పవన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్లకు స్థానం లేదని నిజాయితీగా పని చేసే కార్యకర్తలను కొందరు చీడ పురుగులు చూస్తున్నారని, తమ మాట నెగ్గాలనే ఉద్దేశంతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పార్టీ కోసం ఏ త్యాగం చేయనప్పటికీ పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ వర్గాలుగా విడగొట్టి పార్టీ నాశనానికి కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజంగా పార్టీ కోసం పని చేసే నాయకులైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంపిగా నిలబడి గెలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాగే పార్టీలో కొనసాగితే నా మనుగడ కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఉన్నానని భవిష్యత్ కార్యాచరణను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. డికె అరుణ వర్గీయులను మొత్తాన్ని బయటకు పంపడానికి సిద్దమయ్యారని ఇప్పటికే పాలమూరు ఏడు నియోజకవర్గాలలో బలమైన నాయకులు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నానని చెప్పినా సస్పెండ్ చేశారని ఆవేదన మండిపడ్డారు. కొందరు పెద్ద మనుషుల కుట్ర వల్లనే ఇలా జరిగిందని వాపోయారు.

నా పేరు, అడ్రస్ కూడా పూర్తిగా తెలియని వ్యక్తులు సస్పెండ్ కాపీలో నా పేరు, అడ్రస్ తప్పే ఉందని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు పంపాలనే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. ప్రభుత్వం పోయినప్పటికీ పార్టీ గురించి ఆలోచించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా పార్టీ పతనానికి కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇతర పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ నాశనానికి కారణం అవుతున్నారని వాపోయారు. ఏ ఉద్దేశంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

 

Jaipal Reddy Destroy Congress in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: