మూసీ ప్రాజెక్టు గేటును 48 గంటల్లో అమరుస్తాం

  నల్లగొండ: వరద ఉధృతికి మూసీ నదిపై ఉన్న ఓ గేటు కొట్టుకుపోవడంతో అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను అక్కడికక్కడే తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మూసీ గేటు కొట్టుకుపోవడంతో పరిస్థితి తీవ్రతను ఆదివారం ఉదయం సిఎంకు వివరించారు. స్పందించిన కెసిఆర్ ఆయన కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు ఈఎన్‌సి మురళీధర్‌రావులు మూసీని సందర్శించాలని ఆదేశించారు. వీలైనంత తొందరగా పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆదివారం […] The post మూసీ ప్రాజెక్టు గేటును 48 గంటల్లో అమరుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: వరద ఉధృతికి మూసీ నదిపై ఉన్న ఓ గేటు కొట్టుకుపోవడంతో అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను అక్కడికక్కడే తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మూసీ గేటు కొట్టుకుపోవడంతో పరిస్థితి తీవ్రతను ఆదివారం ఉదయం సిఎంకు వివరించారు. స్పందించిన కెసిఆర్ ఆయన కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు ఈఎన్‌సి మురళీధర్‌రావులు మూసీని సందర్శించాలని ఆదేశించారు. వీలైనంత తొందరగా పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆదివారం హుటాహుటిన హెలికాప్టర్లో ఉన్నతాధికారులు సూర్యాపేటకు బయలుదేరారు. అక్కడి నుంచి మూసీ ప్రాజెక్టుకు రోడ్డుమార్గం ద్వారా వెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతేపల్లి వద్ద మూసీ నదిపై జలాశయం ఉంది.

అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు మూసీలో వచ్చి చేరింది. అయితే ఈ వరద ధాటికి జలశాయంలోని ఐదో నంబర్ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీరంతా దిగువన ఉన్న మూసీ నదిలోకి వృథాగా వెలుతోంది.. తొలగిన మూసీ గేట్‌ను 48 గంటల్లో అమరుస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9 నాటికి మూసీని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నీటిపారుదల ఇంజినీరింగ్ నిపుణులతోపాటు స్మితా సబర్వాల్,మురళీధర్ రావులతో మంత్రి జగదీష్ రెడ్డి డ్యామ్ మీదనే ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిపుణులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న డ్యామ్ వివరాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.మొత్తం సమీక్షించిన మీదట 1991 ప్రాంతంలో మూసీ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు గేట్లను అదనంగా తయారు చేశామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అయితే అప్పట్లో తిరుపతిలో సమీపంలో నిర్మిస్తున్న కల్యాణి డ్యామ్ కు తరలించడం జరిగిందని వాటిలో రెండు అక్కడ వినియోగించుకోగా మూడు మిగిలి ఉన్నాయని నిపుణులు మంత్రికి వివరించారు. దీంతో తిరుపతి నుండి ఆ మూడు గేట్లు తెప్పించి 48 గంటల్లో అమర్చనున్నట్లు తెలిపారు. అంతే గాకుండా ఈ నెల 9 నాటికి మూసీ డ్యామ్ మరమ్మత్తులు పూర్తి చేసి వృధాగా పోతున్న నీటిని నిలువరించనున్నట్లు మంత్రికి వివరించారు. మూసీ ఆయకట్టు రైతాంగం ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దని కోరారు.రైతాంగాన్ని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు అదేశించినందున వదంతులను నమ్మవద్దని హితవు పలికారు. ఈ సమీక్షలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్యలు కూడా పాల్గొన్నారు.

నల్లగొండ: కేతేపల్లిలో మూసీ గేటును పరిశీలించి అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సిఎం ఒఎస్డి సబర్వాల్, ఎంఎల్ఎలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఈఎస్ సి మురళీధర్ రావు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు పాల్లొన్నారు. కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్టు గేటును 48 గంటల్లో అమరుస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 9వ తేదీన వరకు డ్యామ్ మరమ్మతులు పూర్తి చేస్తామని, మూసీ ఆయకట్టు రైతులు ఆందోలన చెందొద్దు, కుడి, ఎడం కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తామని చెప్పారు.

Jagadish Reddy review with authorities on Musi project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూసీ ప్రాజెక్టు గేటును 48 గంటల్లో అమరుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: