కాంగ్రెస్ ను ఖతం చేద్దాం: జగదీష్ రెడ్డి

మన తెలంగాణ/నార్కట్‌పల్లి (నల్గొండ జిల్లా): జిల్లా ప్రజా పరిషత్,మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఖతంచేసి అభివృద్ధిని కొనసాగించుకుందామని రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గురువారం ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్కట్‌పల్లి మండల కేంద్రం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పట్టిన శాపమే కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. పొద్దున ఒక అబద్దం.. పూటకో మోసం చేసే […] The post కాంగ్రెస్ ను ఖతం చేద్దాం: జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/నార్కట్‌పల్లి (నల్గొండ జిల్లా): జిల్లా ప్రజా పరిషత్,మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఖతంచేసి అభివృద్ధిని కొనసాగించుకుందామని రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గురువారం ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్కట్‌పల్లి మండల కేంద్రం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పట్టిన శాపమే కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. పొద్దున ఒక అబద్దం.. పూటకో మోసం చేసే నేతల దుర్మార్గానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు, పిసిసి అధ్యక్షునితోపాటు రాహుల్ గాంధీ వచ్చి అడ్డుపడ్డా ఉద్యమ సహచరుడు బండా నరేందర్‌రెడ్డి గెలుపును అడ్డుకోలేరని ఆయన తెలిపారు. ఫ్యూడల్ మనస్థత్వం నుండి కాంగ్రెస్ పార్టీ నేతల ఇప్పటికి బయట పడలేక పోతున్నారన్నారు. అటువంటి నేతల చేతుల్లో చిక్కిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాను ఏలిన నేతలు వారేనని, అటువంటి నేతలే ఫ్యూడల్ భావజాలంతో అభివృద్ధి నిరోధకులుగా నిలుస్తారని మంత్రి దయ్యబట్టారు. యాద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటమాని ప్రకటించునందుకే ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని ఎద్దేవా చేశారు. అటువంటి పాలన నుండి బయట పడేందుకే జిల్లా ప్రజలకు 35 ఏండ్లు పట్టిందన్నారు, 2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీకి 6 శాసన సభ, 1లోక్ సభ స్థానాన్ని కట్టబెట్టిన జిల్లా ప్రజలు మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఏలిన నాటి శనిని వదిలించుకున్నారన్నారు. నిన్నగాక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రెండింటిలోను విజయం సాధించ డంతోపాటు రేపటి ప్రాధేశిక ఎన్నికలలో మూడు జిల్లా పరిషత్‌లపై గులాబి జెండాను ఎగురవేస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మేల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు,నార్కట్‌పల్లి జెడ్‌పిటిసి అభ్యర్ధి బండా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Jagadish Reddy Election Campaign In Narketpally

The post కాంగ్రెస్ ను ఖతం చేద్దాం: జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: