పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిన మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy

 

నల్గొండ: నాగార్జుసాగర్ లో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ నోముల నర్సింహాయ్య, ఎంఎల్ సి తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… విద్యాప్రమాణాలను పెంచి ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థులు పోటీపడేలా సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. విద్యలో సిఎం కెసిఆర్ సమూల సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. గురుకుల పాఠశాలలు దేశంలోనే గొప్ప పేరును సంపాదించాయని, నాగార్జుసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు జగదీష్ రెడ్డి వెల్లడించారు. సిఎం కెసిఆర్ కొత్తగా రూపొందించిన మున్సిపాలిటీ చట్టం పట్టణాలను సుందరంగా మారుస్తుందాని, నూతన మున్సిపల్ చట్టంపై పట్టణవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jagadish Reddy begins the Polytechnic Hostel building

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిన మంత్రి జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.