టిఆర్‌ఎస్‌కు గులాబీ కండువే ప్రోటోకాల్

 తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో గొప్ప ఖ్యాతిని సంపాదించింది,  దేశానికి ప్రజారంజక పాలనను పరిచయం చేసింది సిఎం కెసిఆర్ : మంత్రి జగదీష్‌రెడ్డి నల్లగొండ రూరల్ : గులాబీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు గులాబీ కండువే గొప్ప ప్రోటోకాల్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం టిఆర్‌ఎస్ సభ్యత్వ నమో దు కార్యక్రమం సందర్భంగా స్థానిక లక్ష్మిగార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఆయన సభ్యత్వ నమోదు […] The post టిఆర్‌ఎస్‌కు గులాబీ కండువే ప్రోటోకాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో గొప్ప ఖ్యాతిని సంపాదించింది,  దేశానికి ప్రజారంజక పాలనను పరిచయం చేసింది సిఎం కెసిఆర్ : మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ రూరల్ : గులాబీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు గులాబీ కండువే గొప్ప ప్రోటోకాల్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం టిఆర్‌ఎస్ సభ్యత్వ నమో దు కార్యక్రమం సందర్భంగా స్థానిక లక్ష్మిగార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీటిచైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఫంక్షన్ హాల్ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోనే అభివృద్ధ్ది పథకాలుగా అమలవుతున్నాయన్నారు.

మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, రైతుబంధు, రైతుభీమా, కెసిఆర్‌కిట్, కల్యాణల, షాదిముబారక్, కంటి వెలుగు లాంటి పథకాలే లేవని తెలంగాణ ప్రజల భాగుకోసమే టిఆర్‌ఎస్ పార్టీకి సిఎం కెసిఆర్ పురుడు పోశారన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అధ్యక్షుడుగా ఉన్న టిఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వం పొంద డం మనందరి అదృష్టమన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా కొనసాగించాలని కోరా రు. నియోజకవర్గానికి 50వేలకు తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 30వేల సభ్యత్వ నమోదు లక్ష ంగా ప్రతి కార్యకర్త, నాయకులు పనిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డికి సభ్యత్వాన్ని అందజేసి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నల్లగొండ ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, అనిల్‌కుమార్, శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేకల భద్రాద్రి, నియోజకవర్గ వ్యాప్తం గా భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

Jagadish Reddy at the TRS membership drive in Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్‌కు గులాబీ కండువే ప్రోటోకాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.