స్కూల్‌డేస్‌లోనే ప్రేమాయణం!

  శ్రీలంక సోయగం జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాల్లో దర్శనమిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అన్నీ క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అమ్మడి టాలెంట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. తాజాగా ఈ భామ తన మొదటి ముద్దు అనుభవం గురించి తెలియజేసింది. 14 ఏళ్లకే తాను ఫస్ట్ లిప్‌లాక్ లాగించేశానని ధైర్యంగా చెప్పేసింది. ఆ వయసులోనే తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని… స్కూల్ డేస్‌లో మూడు సంవత్సరాల పాటు […] The post స్కూల్‌డేస్‌లోనే ప్రేమాయణం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీలంక సోయగం జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాల్లో దర్శనమిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అన్నీ క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అమ్మడి టాలెంట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. తాజాగా ఈ భామ తన మొదటి ముద్దు అనుభవం గురించి తెలియజేసింది. 14 ఏళ్లకే తాను ఫస్ట్ లిప్‌లాక్ లాగించేశానని ధైర్యంగా చెప్పేసింది. ఆ వయసులోనే తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని… స్కూల్ డేస్‌లో మూడు సంవత్సరాల పాటు బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమాయణాన్ని కొనసాగించానని చెప్పింది జాక్విలిన్. ఆతర్వాత మాత్రం అబ్బాయిలకు కాస్త దూరం పాటించడం మొదలుపెట్టిందట. ఇక బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని ఈ భామ చెప్పింది. అన్నింటినీ అధిగమించి ప్రస్తుతం గ్లామరస్ తారగా బాలీవుడ్‌లో రాణించడం తనకెంతో ఆనందంగా ఉందని జాక్విలిన్ పేర్కొంది. మరో నాలుగు, ఐదు సంవత్సరాలు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నట్టు ఈ భామ చెప్పింది.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్కూల్‌డేస్‌లోనే ప్రేమాయణం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.