పవన్‌కళ్యాణ్ కు జోడీగా జాక్విలిన్ ఫెర్నాండెజ్..?

Jacqueline opposite to Pawan Kalyan in Virupaksha

పవన్‌కళ్యాణ్ 27వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా సాగి ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఇప్పటికే ఈ సినిమా సగం వరకు పూర్తయ్యేది. మెఘలుల కాలం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. పవన్ చేయబోతున్న మొదటి చారిత్రాత్మక నేపథ్య సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ భారీగా అంచనాలుపెట్టుకున్నారు. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ దొంగగా కనిపించబోతున్నాడు. మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన ఒక నిధిని దొంగలించేందుకు పవన్ ప్రయత్నించే కథతో ఈ సినిమా రూపొందబోతుందట.

ఈ చిత్రంలో బాలీవుడ్ హాటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను కూడా నటింపజేస్తున్నట్లుగా తెలిసింది. క్రిష్ కు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. అందుకే జాక్విలిన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జాక్విలిన్ ఈ సినిమాలో నటిస్తే దీనికి జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చే అవకాశం ఉందని కూడా క్రిష్ భావిస్తున్నాడట. ఈ చిత్రంలోని కీలకమైన యువరాణి పాత్రలో ఆమె నటిస్తుందట. అయితే ఆమె పాత్ర సినిమా సెకండ్ హాఫ్‌లో మాత్రమే కనిపిస్తుందని టాక్. జాక్విలిన్ పాత్ర చనిపోతుందని కూడా తెలిసింది. ఆమె పాత్రపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Jacqueline opposite to Pawan Kalyan in Virupaksha

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పవన్‌కళ్యాణ్ కు జోడీగా జాక్విలిన్ ఫెర్నాండెజ్..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.