అలీబాబా చైర్మన్ పదవికి జాక్‌మా గుడ్‌బై

  షాంఘై: చైనా సంస్థ అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ చైర్మన్ జాక్ మా తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తన 55వ పుట్టిన రోజున ఈ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ అలీబాబా పార్ట్‌నర్‌షిప్ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు. 460 బిలియన్ డాలర్ల విలువచేసే ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూప్ నుంచి వైదొలగిన తర్వాత జాక్ మా ఏం చేస్తారనే సందేహాలు నెలకొన్నాయి. జాక్ మా […] The post అలీబాబా చైర్మన్ పదవికి జాక్‌మా గుడ్‌బై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షాంఘై: చైనా సంస్థ అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ చైర్మన్ జాక్ మా తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తన 55వ పుట్టిన రోజున ఈ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ అలీబాబా పార్ట్‌నర్‌షిప్ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు. 460 బిలియన్ డాలర్ల విలువచేసే ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూప్ నుంచి వైదొలగిన తర్వాత జాక్ మా ఏం చేస్తారనే సందేహాలు నెలకొన్నాయి. జాక్ మా 1999లో ‘అలీబాబా’ను ప్రారంభించారు. దీనికి ముందు ఆయన ఆంగ్ల ఉపాధ్యాయుడుగా చేశారు. జాక్ మా తన పదవీ విరమణ గురించి న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ తన పదవీ విరమణ ముగింపు కాదు, కొత్త అధ్యాయం ఆరంభమని అన్నారు. ‘నేను విద్యను చాలా ప్రేమిస్తున్నాను, కావున ఈ రంగంలో డబ్బు, సమయాన్ని పెట్టుబడి పెడతాను’ అని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్లేగేట్స్ మాదిరిగానే జాక్ మా విద్యకు సంబంధించిన ఫౌండేషన్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. పదవీ విరమణ ప్రకటించిన సమయంలో జాక్ తాను బిల్‌గేట్స్ నుంచి ఇంకా చాలా నేర్చుకోవలసి ఉందని అన్నారు. అమెరికా, -చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా పరిశ్రమ రంగంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో జాక్ మా సంస్థకు దూరమవుతున్నారు. చైర్మన్ పదవి నుంచి తొలగనున్నట్టు ఆయన ఏడాది క్రితమే నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఆయన అలీబాబా భాగస్వామ్యంలో సభ్యుడిగా ఉంటారు. సంస్థ డైరెక్టర్ల బోర్డులో మెజారిటీ సభ్యులను నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన బృందం ఇది. చైనా ఎగుమతిదారులను నేరుగా అమెరికన్ రిటైలర్లతో అనుసంధానించడానికి అలీబాబా ఇ-కామర్స్ సంస్థను జాక్ మా ఓ వేదికగా చేశారు. దీని తర్వాత చైనాలో పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్లో సరఫరాను పెంచడానికి సంస్థ తన పని పరిధిని మార్చింది.
జాక్ మా జీవితం స్ఫూర్తిదాయకం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఆస్తులు 41 బిలియన్ డాలర్లు. ఆయన ఒక గురువు నుండి అలీబాబా వంటి పెద్ద సంస్థను నిర్మించే ప్రయాణంలో చాలా కష్టపడ్డారు. ఆయన తన కెరీర్ ప్రయాణంలో ఉపయోగించిన, ముందుకు సాగిన విధానంలో అవలంభించిన మార్గాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.
* ఈ రోజు కఠినమైనది, రేపు అధ్వాన్నంగా ఉంటుంది, కానీ రేపు తర్వాత మంచి రోజులు ఉంటాయని ఆయన అంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి.
* తెలివైన ప్రజలను నడిపించడానికి ఒక మూర్ఖుడు అవసరం. శాస్త్రవేత్తలందరూ బృందంలో ఉంటే, ఒక రైతుకు నాయకత్వం ఇవ్వడం మంచిది ఎందుకంటే అతని ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. మీకు భిన్న దృక్పథం ఉన్నప్పుడు గెలవడం సులభం.
* యువతకు సహాయం చేయండి. చిన్న వ్యక్తులకు సహాయం చేయండి. ఎందుకంటే చిన్న వ్యక్తులు పెద్దవారు అవుతారు. మీరు విత్తనాలు యువకుల మనస్సులలో విత్తుతారు, అవి పెద్దయ్యాక ప్రపంచాన్ని మారుస్తాయి.
* మీరు మీతో సరైన వ్యక్తులను కోరుకుంటారు, ఉత్తమ వ్యక్తులను కాదు.
* అలీబాబాకు అధ్వాన్న పరిస్థితి సమయంలో ఆవిష్కరణలు, భిన్నత్వం గురించి నేను తెలుసుకున్నాను.
* జీవితం చాలా చిన్నది, చాలా అందంగా ఉంటుంది. పని గురించి అంత తీవ్రంగా ఆలోచించవద్దు. జీవితాన్ని ఆస్వాదించండి.
* సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం.
* ఇతరుల విజయాల నుండి నేర్చుకునే బదులు, వారి తప్పుల నుండి నేర్చుకోండి. విఫలమైన చాలా మందికి వారి వైఫల్యం కారణం ఒకటే ఉంటుంది, అయితే విజయానికి చాలా కారణాలు ఉండవచ్చు.
* ఎప్పుడూ ధరపై పోటీపడొద్దు, అయితే సేవ, ఆవిష్కరణలపై పోటీపడాలి.

Jack Ma to step down as Alibaba’s chairmanship

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అలీబాబా చైర్మన్ పదవికి జాక్‌మా గుడ్‌బై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: