వాటికంటే.. ఐటెం సాంగ్స్‌ చేయడమే బెటర్..

హైదరాబాద్‌: హీరోయిన్ గా నటించడం కంటే ఐటెం సాంగ్స్‌ చేయడమే మేలంటుంది హాట్ భామ హంసా నందిని. తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన హంసా నందిని తర్వాత ఐటెం సాంగ్స్ కే పరిమితమైంది. సినిమాల్లో నటించకుండా కేవలం ఐటెం సాంగ్సే చేయడంపై హంసా నందిని తాజాగా క్లారిటీ ఇచ్చింది.  హీరోయిన్‌గా తనకు రొటీన్ పాత్రలే వచ్చాయని, ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రలు చేయడంకన్నా ఐటెం సాంగ్స్‌ చేయడమే మేలని నిర్ణయించుకున్నాని తెలిపింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. అందుకే ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నానని పేర్కొంది హంసా.

కాగా, కొరటాల శివ, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘మిర్చి’ మూవీ టైటిల్ సాంగ్ లో హంసా నందిని ఆడిపాడింది.  ఆ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తర్వాత చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి జోరు చూపింది.

Item Songs better than to heroine roles:Hamsa Nandini

The post వాటికంటే.. ఐటెం సాంగ్స్‌ చేయడమే బెటర్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.