లావా విరజిమ్ముతున్న ఎట్నా అగ్నిపర్వతం

రోమ్: యూరోప్‌లో అత్యంత ఎత్తైన ఇటలీలోని ఎట్నా అగ్ని పర్వతం అత్యంత క్రియాశీలకమైంది. ఎట్నా ఆకాశంలోకి నిప్పులు, వేడి బూడిదను భారీగా విరజిమ్ముతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్ అండ్ వొల్కనాలజీ (ఐఎన్‌జివి) తెలిపింది. గురువారం ఉగ్రరూపం దాల్చిన అగ్ని పర్వతం శనివారం నాటికి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, పర్వతారోహకులకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఐఎన్‌జివి పేర్కొంది. ఈశాన్య, దక్షిణ, అగ్నేయ దిశలో రెండు విస్పోటనాల నుంచి లావా విరజిమ్మింది. తాజాగా వెలువడుతున్న లావాతో సమీప […] The post లావా విరజిమ్ముతున్న ఎట్నా అగ్నిపర్వతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


రోమ్: యూరోప్‌లో అత్యంత ఎత్తైన ఇటలీలోని ఎట్నా అగ్ని పర్వతం అత్యంత క్రియాశీలకమైంది. ఎట్నా ఆకాశంలోకి నిప్పులు, వేడి బూడిదను భారీగా విరజిమ్ముతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్ అండ్ వొల్కనాలజీ (ఐఎన్‌జివి) తెలిపింది. గురువారం ఉగ్రరూపం దాల్చిన అగ్ని పర్వతం శనివారం నాటికి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, పర్వతారోహకులకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఐఎన్‌జివి పేర్కొంది. ఈశాన్య, దక్షిణ, అగ్నేయ దిశలో రెండు విస్పోటనాల నుంచి లావా విరజిమ్మింది. తాజాగా వెలువడుతున్న లావాతో సమీప ప్రాంతాల్లోని నివాసితులకు గాని, కటానియాకు సమీపంలోకి వచ్చే విమానాలకు ముప్పేమి లేదని తెలిపింది.

Italy mount Etna highest volcano

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లావా విరజిమ్ముతున్న ఎట్నా అగ్నిపర్వతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: