ఆధార్‌తో పన్ను చెల్లిస్తే ఆటోమేటిక్‌గా కొత్త పాన్

సిబిడిటి చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ న్యూఢిల్లీ: ఆధార్ కార్డును మాత్రమే వినియోగించి ఐటి రిటర్న్‌లు దాఖలు చేసేవారికి ఆటోమెటిక్‌గా కొత్త పాన్ కార్డును జారీ చేస్తామని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డు సరిపోతుందని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రెండు డేటాబేస్‌ల అనుసంధానం ప్రక్రియలో ఇది భాగమని అన్నారు. […] The post ఆధార్‌తో పన్ను చెల్లిస్తే ఆటోమేటిక్‌గా కొత్త పాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిబిడిటి చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఆధార్ కార్డును మాత్రమే వినియోగించి ఐటి రిటర్న్‌లు దాఖలు చేసేవారికి ఆటోమెటిక్‌గా కొత్త పాన్ కార్డును జారీ చేస్తామని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డు సరిపోతుందని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రెండు డేటాబేస్‌ల అనుసంధానం ప్రక్రియలో ఇది భాగమని అన్నారు. పాన్ (శాశ్వత గుర్తింపు సంఖ్య) ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని, గతవారం బడ్జెట్‌లో ప్రకటించిన పరస్పర మార్పిడి అనేది పాన్, ఆధార్ డేటాబేస్ అనుసంధానం నిర్ధారించడానికి అదనపు సౌకర్యం అని, ఇది ప్రస్తుతం చట్టం ప్రకారం తప్పనిసరి అని ప్రమోద్ మోడీ వివరించారు.

ఒకవేళ ఆధార్ ఉండి, పాన్ కార్డు లేకపోయినట్లయితే అటువంటి వ్యక్తులకు(పన్ను రిటర్న్ దాఖలు చేసినవారు) పాన్ కేటాయిస్తామని ఆయన అన్నారు. ‘పాన్ లేని సందర్భంలో ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. పాన్ ఇక పూర్తిగా కనుమరుగు అయిపోదు. పాన్ కార్డు అలాగే ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే పన్ను రిటర్న్‌లను సులభతరం చేసేందుకు గత వారం బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ఈ నిర్ణయం ప్రకటించారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి పాన్ లేకపోతే ఆధార్ సంఖ్యను ఉపయోగించవచ్చని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల వేధింపులను తగ్గించడానికి, ఈ సంవత్సరం దశలవారీగా ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా ఎలక్ట్రానిక్ విధానంలో ఫేస్‌లెస్ ఆదాయపు పన్ను అంచనా అమలు చేయనున్నామని తెలిపారు.

ప్రీ ఫిల్ ఐటిఆర్ ఫారాలు
ఐటి రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం జీతం ఆదాయం కాకుండా బ్యాంకు వడ్డీ, డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర ఆదాయాలు ఉన్న వారు వివిధ ఐటిఆర్ ఫారాలను వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వివరాలను తెలియచేయాల్సిన అవసరం లేదు. వీటి స్థానంలో ప్రీ ఫిల్ ఐటిఆర్ ఫారంలు అందుబాటులోకి వస్తున్నాయి. ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయడానికి బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఇపిఎఫ్‌ఒ, రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు.

అదే విధంగా రిటర్నుల పరిశీలనలు కూడా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నామని, అలాగే స్టార్టప్‌లకు పరిశీలన నుంచి మినహాయింపు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారానే కావాల్సిన సమాచారాన్ని అడిగి తీసుకుంటారు. దేశంలో ఇప్పటికే ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 120 కోట్లు దాటడం, సుమారు అన్ని ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌కార్డు అనుసంధానం తప్పనిసరి అయింది. ఈనేపథ్యంలో పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు నెంబరుతో రిటర్నులు దాఖలు చేయవచ్చని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

IT will suo motu allot PAN to those only furnishing Aadhaar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆధార్‌తో పన్ను చెల్లిస్తే ఆటోమేటిక్‌గా కొత్త పాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.