ఆరోగ్య రుచులు

  ఇంటి వంటలో చిన్నచిన్న మార్పులు చేర్పుల వల్ల రుచి అమోఘంగా మారుతుంది. చిన్నపిల్లలు జంక్, ఫాస్ట్‌ఫుడ్‌ల జోలికి వెళ్లకుండా చక్కగా తింటారు. ఖరీదైన ఆహార పదార్థాలకు బదులు తక్కువ ఖర్చయ్యే పోషకాహారాన్ని సూచిస్తున్నారు న్యూట్రిషియన్లు. అధిక పోషకాలున్న కూరగాయలపై చిన్నారులకు ఆసక్తిని కలిగించడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు ఆహార నిపుణులు. బయటతినే ఆహారం అప్పటికి బాగున్నా ఆరోగ్యం చెడిపోతుంది. ఇంట్లోనే వండుకుంటే మంచిదంటున్నారు. అందరూ ఇష్టపడేందుకు కొన్ని టిప్స్‌ను ఇస్తున్నారు. రోజువారీ తీసుకునే ఆహారంలో కచ్చితంగా […] The post ఆరోగ్య రుచులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇంటి వంటలో చిన్నచిన్న మార్పులు చేర్పుల వల్ల రుచి అమోఘంగా మారుతుంది. చిన్నపిల్లలు జంక్, ఫాస్ట్‌ఫుడ్‌ల జోలికి వెళ్లకుండా చక్కగా తింటారు. ఖరీదైన ఆహార పదార్థాలకు బదులు తక్కువ ఖర్చయ్యే పోషకాహారాన్ని సూచిస్తున్నారు న్యూట్రిషియన్లు. అధిక పోషకాలున్న కూరగాయలపై చిన్నారులకు ఆసక్తిని కలిగించడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు ఆహార నిపుణులు. బయటతినే ఆహారం అప్పటికి బాగున్నా ఆరోగ్యం చెడిపోతుంది. ఇంట్లోనే వండుకుంటే మంచిదంటున్నారు. అందరూ ఇష్టపడేందుకు కొన్ని టిప్స్‌ను ఇస్తున్నారు.

రోజువారీ తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని నియమాలు పాటించమంటున్నారు న్యూట్రిషియన్లు. కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల పోషకాలున్న ఆహారం శరీరానికి అందుతుందంటున్నారు. వీటితోపాటు రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది.
* బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నింటికంటే మంచిది స్మూతీ. తేనె, తక్కువ వెన్న గల పాలు, సహజంగా లభించే పండ్లు లేదా బాగా మగ్గిన పళ్ల న్యూట్రిషియస్ బ్లెండ్ చేసి తాగినా త్వరగా ఆకలేయదు.
* నారింజ, దానిమ్మ, మామిడి, స్ట్రాబెర్రీలతో పాటు కర్బూజా, తర్బూజా, జామ, టొమాటో, పాలకూర మొదలైన జ్యూస్ కాక్‌టైల్ తీసుకోవచ్చు.

* క్యారెట్, ముల్లంగి, కీరా, దోసకాయల చిన్న ముక్కలకు తేనె, వెల్లుల్లి పేస్టు, సైంధవ లవణం, మిరియాలు లేక కారంపొడితో నిమ్మరసం లేదా వెనిగర్‌లో కొత్తిమీర, పుదీనా పేస్ట్‌తో చట్‌పట్ సలాడ్ లేదా చట్నీ తయారుచేసుకోవచ్చు.
* ఆలూ, గోబీ, బ్రకోలీ, బీట్‌రూట్, క్యారెట్, వేయించేందుకు నూనె కొన్ని చుక్కలు సరిపోతుంది. జీలకర్ర, వాము, కరివేపాకు, లావు మిరియాలు, ధనియా మెంతిపొడితో సన్ననిసెగపై వేయించటం లేక బేక్ చేస్తే రుచి పెరుగుతుంది. దాన్ని సైడ్ డిష్‌లో తినొచ్చు లేదా పప్పు నీటిలో ఉడికించి సూప్‌లా చేసుకోవచ్చు.
* పప్పు సూప్‌లా తీసుకోవచ్చు. నీళ్లలో కూరగాయ తొక్కులు ఉడికించి స్టాక్ చేసి పెట్టండి. అందులో పప్పు లేదా కూర చాలా రుచికరంగా ఉంటుంది. మీట్ స్టాక్‌తో నాన్‌వెజ్ డిష్‌లు రుచికరంగా ఉంటాయి. నెయ్యి, వెన్న లేదా మీగడకు ప్రత్యామ్నాయం చిక్కని పెరుగు.

* పప్పులో కూరగాయలు లేదా చికెన్ లాంటివి వేసి, కొంచెం నెయ్యిలేదా నూనెతో కలియబెట్టాక చిక్కని పెరుగుతో రుచిని పెంచండి. శనగపిండి పకోడీలను వేయించడానికి బదులు ఆవిరి లేదా మరిగే నీటిలో ఉడికించండి. డోక్లాలా చేసి పాన్‌పై తక్కువ ఆయిల్‌తో వేయించి తినండి.
* మిక్స్ కర్రీని ఉడికించిన ఆలుగడ్డలు లేదా వంకాయలతో కూడా చేయొచ్చు. గోబీ, సొరకాయ, బీరకాయ, క్యారెట్, బఠాణీ మొదలైనవి. అన్నీ కలిపి లేదా వేర్వేరుగా చేయొచ్చు. నల్లశనగలు, బీట్‌రూట్, రాజ్మా, అలసందలు లేదా పెసరపప్పుతో కూడా రుచికరంగా ఉంటుంది.
* వేపుడుకి బదులుగా బేక్డ్ ఆలుగడ్డల చిప్స్, అప్పడాలు, ఖఖ్రా అప్పడాలు, డ్రై అటుకులు, శనగలు, మరమరాలు, పాప్‌కార్న్ పేలాలు, డ్రైమేవా, బొప్పాయి, సొరకాయ, పొద్దుతిరుగుడు వేయించిన విత్తనాలు ఇవన్నీ సాయంత్రాలు ఫలహారంగా బాగుంటాయి.

* చక్కని రుచికోసం నెయ్యి లేదా నూనెనే వేయాలని లేదు, జీడిపప్పు, బాదం, నువ్వులు, గసాలతో గ్రేవీని రిచ్‌గా చేయొచ్చు. రిచ్ గ్రేవీ కోసం ఉల్లి, వెల్లుల్లి, అల్లం, టమాటా పేస్ట్‌ను నెయ్యి లేదా నూనెలో వేయించడానికి బదులు వీటిని కడాయిలో లేదా పాన్‌లో వేర్వేరుగా వేయించండి. 5 6 బాదం, జీడిపప్పు లేదా ఒక చెమ్చా గసగసాలు, ఆవాలు కూడా పొడిగా వేయించి అన్నింటినీ కొన్ని పాలలో ఉడికించి మిక్సీలో రుబ్బండి.
* పిల్లలకు మైక్రోనీ, చీజ్ బాగా నచ్చుతున్నట్లయితే మైదాకి బదులు గోధుమపిండి పాస్తా, లోఫ్యాట్ ఛీజ్‌తో చేయండి. సాస్‌లో వెన్నలాంటివి తగ్గించి వేయించి గ్రైండ్ చేసిన కూరగాయలు మొదలైనవి పెంచండి.
* మారెట్‌లో ఉన్న రెడీమేడ్ ఆహారంలో రుచిని పెంచుందుకు వాడే చెక్కర, ఉప్పు, జిగురు, ప్రిజర్వేటివ్‌లపై నియంత్రణ ఉండదు. వీలైనంతవరకు ఇలాంటివాటి జోలికిపోకపోవడం బెటర్.

 

It is better if cooked at home

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్య రుచులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: