దసరా నాటికి ఐటి హబ్ పూర్తి…

IT Hub

 

నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తా
అమెరికాలోని ప్రవాస ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులతో సమావేశం అవుతా
జిల్లాలో చేపట్టే పలు కార్యక్రమాలకు ఎన్‌ఆర్‌ఐల సహాయాన్ని కోరుతా
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వెల్లడి

ఖమ్మం  : వచ్చే విజయదశమి పండగ నాటికి ఖమ్మం నగరంలో ఐటి హబ్ ప్రారంభం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌తో ధీ టుగా ఖమ్మంలో కూడా ఐటి రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్షంతో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందేనని, ఇప్పటికే భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, దసరా నాటి కి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి సమర్థవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నానని ఆయన తెలిపారు.

అమెరికా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పలు ఐటి సంస్థలు ఖమ్మం కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయని అందులో భాగంగానే తాను అమెరికా వెళ్ళి మరోసారి వారితో సంప్రదింపులు జరుపాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఈ నెల 2న అమెరికా వెళ్తున్నానని అక్కడ జరిగే తానా సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్ని ఐటి హబ్‌తో ఒప్పం దం చేసుక్ను కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమై దసరా నాటికి అక్కడ వారి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఆహ్వానించబోతున్నట్లు ఆయన చెప్పారు. అం తేగాక అమెరికాలో స్థిరపడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులతో ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో చేపట్టే బోయే పలు కార్యక్రమాలకు వారి సహాయాన్ని కోరుతానన్నారు.

ఖమ్మంలో పనిచేసే ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టిందని అనేక ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌళిక సదుపాయాలను కల్పించిందని ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ అమెరికాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోతున్నానని ఆయన అన్నారు. ఈ ఫౌండేషన్ కూడా ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేవిధంగా వారి సహకారాన్ని కూడా కోరుతానని పువ్వాడ తెలిపారు. ఈ నెల 7న తిరిగి ఇండియాకు చేరుకుంటానని ఇక్కడి కి రాగానే మళ్ళీ పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిసారిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని ముఖ్యనేతలందరికీ సభ్యత్వ నమోదుపై దిశదశ నిర్దేశించానని అనుకున్నదానికంటే అధికంగానే సభ్యత్వాలను నమోదు చేయిస్తామని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ, నగర అధ్యక్షులు కమర్తపు మురళి, టిఆర్‌ఎస్ నాయకులు నున్నా మాధవరావు, శీలం శెట్టి వీరభధ్రం, పులిపాటి ప్రసాద్, ఏలూరి శ్రీనివాసరావు, లింగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

IT Hub in Khammam City

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దసరా నాటికి ఐటి హబ్ పూర్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.