విప్రో లాభం రూ.2,553 కోట్లు

IT company Wipro

 

గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : దేశంలో మూడో అతిపెద్ద ఐటి సంస్థ విప్రో జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.2,552 కోట్ల లాభం ఆర్జించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 6.9 శాతం, వార్షిక ప్రాతిపదికన 35.1 శాతం ఎక్కువ. ఆదాయం రూ.15,125.6 కోట్లుగా ఉంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 2.8 శాతం, వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగింది. ఐటి సేవల ఆదాయం సంవత్సరానికి 2.5 శాతం పెరిగి జూలై-సెప్టెంబర్‌లో 204.89 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 0.8- నుంచి 2.8 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది. విప్రో సిఇఒ, ఎండి అబిదాలి జెడ్ నీముచ్‌వాలా మాట్లాడుతూ.. ఆదాయం, మార్జిన్ పరంగా ఇది మంచి త్రైమాసికమని అన్నారు.

మొత్తం వృద్ధి పరిధి కూడా విస్తృతంగా ఉందన్నారు. 7 పరిశ్రమల్లో 6 అంశాల్లో వార్షిక ప్రాతిపదికన పెరిగాయి. భారతీయ కస్టమర్లకు విదేశాలలో అందిస్తున్న సేవలను విస్తరించే వ్యూహంపై ముందుకు సాగిన ఈ సంస్థ దేశంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. స్టాక్ మార్కెట్ ముగిసిన తరువాత విప్రో ఫలితాలను విడుదల చేసిందని నీముచ్‌వాలా అన్నారు. విప్రో షేర్లు బిఎస్‌ఇలో 0.14 శాతం పెరిగి రూ .243.70 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇలో 0.02 శాతం పెరిగి రూ.243.50 వద్ద ముగిసింది.

త్రైమాసిక లాభం                                         (రూ. కోట్లు)                              ఆదాయం (రూ. కోట్లు)
2019 జూలై-సెప్టెంబర్                                  2,552.6                                    15,125.6
2019 ఏప్రిల్-జూన్                                     2,387.4                                    14,716.1
2018 జూలై-సెప్టెంబర్                                  1,888.9                                    14,541

IT company Wipro excelled in quarterly results

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విప్రో లాభం రూ.2,553 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.